AP Politics: జగన్.. బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి అచ్చెన్న మాస్ సెటైర్స్..!
ABN, Publish Date - Aug 11 , 2024 | 07:45 PM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తు చూపుతూ సెటైర్లు వేశారు. ఆదివారం నాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జగన్ పాలనను విమర్శిస్తూ..
అమరావతి, ఆగష్టు 11: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తు చూపుతూ సెటైర్లు వేశారు. ఆదివారం నాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జగన్ పాలనను విమర్శిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు పోస్ట్ చేశారు. ‘అసమర్థ పాలనా విధానాలతో అన్నదాతలను ఆత్మహత్యల పైపు పురికొల్పిన నిర్లక్ష్య పాలన నీది జగన్.. అదే అన్నదాతలకు ఆపన్నహస్తం అందిస్తూ విత్తనం నుంచి మార్కెట్ వరకు ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం మాది. Both are Not Same’ అంటూ బాలయ్య సినిమాలోని పంచ్‌ను వేశారు.
అచ్చెన్న ఏమన్నారంటే..
‘రాష్ట్ర చరిత్రలోనే నీ పరిపాలనలో రైతులకు చీకటి రోజులు. సిద్ధం ఫ్లెక్సీలు మీద చూపించిన శ్రద్ధ ఏనాడైనా రైతుల మీద చూపించావా జగన్. రైతులకు పథకాలు నిలిపేసి.. నీ దిష్టిబొమ్మ వేసిన పాస్ పుస్తకాలు, సమాధి రాళ్ల లాంటి సర్వే రాళ్లు పంపించావు. కేవలం ఖరీఫ్‌లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి, రబీకి ఏ నాడూ ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిన నీచమైన చరిత్ర నీది జగన్. అసమర్థ, అరాచక పరిపాలనలో, అసత్య ఆరోపణల్లో నువ్వు ఒక వర్గానికి ఆదర్శం. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డు పెట్టుకొని పోలీసు బలగాల మధ్య తిరిగిన నువ్వు ఒక్కసారైనా రైతుల మధ్యకు వెళ్లి ఉంటే ఖచ్చితంగా నీకు దేహ శుద్ధి చేసి ఉండేవారు. పంటల బీమా, విత్తనాలు, ఎరువులు, రాయితీపై బిందు సేద్యం, రాయితీపై యంత్రపరికరాలు, ఉద్యాన పంటల రాయితీ.. వీటిలో ఒక్కటైనా రైతులకు అందించావా? సిగ్గు లేకుండా రాష్ట్రం నుంచి పారిపోయి రాజకీయ డ్రామాలు మొదలు పెట్టావు.’
‘అసెంబ్లీ సమావేశాలకు వస్తే నీ చేతకానితనం స్పష్టంగా నీకు తెలుస్తుంది. అన్నీ లెక్కలతో సహా వివరిస్తాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ. 2,384 కోట్ల బకాయిలు పెట్టావు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే బిందు సేద్యం అమలు చేయకుండా కంపెనీలకు రూ. 1167 కోట్లు, ధాన్యం బకాయిలు రూ.1600 కోట్లు బకాయిలు పెట్టి అన్నదాతలను ఇబ్బందులు పెట్టావు. కౌలు రైతులకు, మత్స్యకారులను నీర్వీర్యం చేసే పనికిమాలిన చట్టాలు తెచ్చావు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి అసలు గిట్టుబాటు ధరే లేకుండా చేశావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తే నువ్వు వచ్చి దాన్ని లక్షకి పరిమితం చేసావ్. రాష్ట్రంలో ఒక్కో రైతు నెత్తిన రూ 2.75 లక్షల అప్పు మోపిన నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.’ అంటూ జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 11 , 2024 | 07:45 PM