AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:52 AM
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్‌గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు..
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్‌గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు, టెక్నికల్ టీమ్ అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు.
పెన్షన్ ఆగింది..!
ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ
పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం
సర్వర్‌లో సాంకేతికలోపంతో ఆగిన పెన్షన్ల పంపిణీ
సర్వర్ లోపంపై ఆరా తీస్తున్న అధికారులు
టెక్నికల్ విభాగంలో ఇంకా వైసీపీ ప్రభుత్వ హయంలో పనిచేసిన ఉద్యోగులు
మానవ తప్పిదమా?.. లేక సాంకేతికలోపమా?..
అనే అంశంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం
సుమారు గంటన్నర నుంచి ఆగిన పెన్షన్ల పంపిణీ
పెన్షనర్ల ఐరిస్, థంబ్ పడకపోవడంతో ఆగిన పంపిణీ
పెన్షన్ల పంపిణీలో ఎక్కడేం జరుగుతోంది.. ఒక్క క్లిక్‌తో..
ఇక్కడేమో ఎత్తుకెళ్లారు..!
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఏడవ సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా.. ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్లు అందని పరిస్థితి. అందుకు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ చెప్పిన కారణం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. పింఛన్ పంపిణీ చేసేందుకు వెళ్తుండగా సృహ తప్పి కింద పడిపోయానని చెప్పారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నాలుగు లక్షల రూపాయల పెన్షన్ డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనను 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారని అన్నారు. అయితే పింఛన్ డబ్బులు మాయం కావడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
లంచాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో పండగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
పల్నాడు జిల్లా మాచర్లలో పింఛన్ దారుల వద్ద సచివాలయ ఉద్యోగి చేతివాటం
పెన్షన్లు తీసుకునే వారి వద్ద నుంచి 500 రూపాయలు కమిషన్ తీసుకున్న వాలు నాయక్ .
మాచర్ల-09వ వార్డు సచివాలయం వార్డులో ఘటన
వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ముదావత్ వాలు నాయక్
విషయం తెలుసుకుని వెంటనే వాలు నాయక్‌ను సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్
Updated Date - Jul 01 , 2024 | 02:58 PM