Health Minister Sathya Kumar : క్షయ రహిత దేశానికి పూర్తి సహకారం
ABN, Publish Date - Dec 08 , 2024 | 05:51 AM
భారత్‌ను క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
కేంద్ర మంత్రి నడ్డాతో రాష్ట్ర మంత్రి సత్యకుమార్
దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో టీబీ నివారణ ప్రోగ్రాం
ఏపీలో విజయనగరంను ఎంపిక చేసిన కేంద్రం
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): భారత్‌ను క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం కింద ‘‘ని-క్షయ్ శివిర్:100 డేస్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్’’ను కేంద్రం శనివారం దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో ప్రారంభించింది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం నుంచి సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. టీబీ నివారణ ప్రచార కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్షయ రహితంగా మార్చేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏపీలో 76,590 మంది టీబీ బాధితులు ఉన్నారని చెప్పారు. ఆరోగ్యశాఖ విజయనగరం జిల్లాలో పెద్ద సంఖ్యలో వైద్య శిబిరాలు, విస్తృతంగా అవగాహన ప్రచారాలు నిర్వహిస్తుందన్నారు.
Updated Date - Dec 08 , 2024 | 05:53 AM