Andhra Pradesh: ఓరి దేవుడో ఇలా తెగబడ్డారేంట్రా.. పైకి ఆయుర్వేదం.. లోపల చూస్తే..
ABN, Publish Date - Dec 02 , 2024 | 07:35 PM
కూటి కోసం కోటి విద్యలు అంటారు.. కానీ, ఈ కేటుగాళ్లు మాత్రం స్మిగ్లంగ్ కోసం కోటానుకోట్ల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక ప్లాన్‌లో పోలీసులకు దిరికిపోతే.. ఆ వెంటనే మరో ప్లాన్ వేసేస్తున్నారు. ఊసరవేళ్లి రంగులు మార్చినట్లుగా.. వెంట వెంటనే..
పల్నాడు, డిసెంబర్ 2: కూటి కోసం కోటి విద్యలు అంటారు.. కానీ, ఈ కేటుగాళ్లు మాత్రం స్మిగ్లంగ్ కోసం కోటానుకోట్ల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక ప్లాన్‌లో పోలీసులకు దిరికిపోతే.. ఆ వెంటనే మరో ప్లాన్ వేసేస్తున్నారు. ఊసరవేళ్లి రంగులు మార్చినట్లుగా.. వెంట వెంటనే తమ ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. పొడి రూపంలో, లిక్విడ్ రూపంలో అయితే వెంటనే దొరికిపోతున్నామని భావించారో ఏమోగానీ.. గంజాయ్ స్మగ్లర్లు కొత్త అవతారమెత్తారు. ఇంతకాలం చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయించిన కేటుగాళ్లు.. ఇప్పుడు సరికొత్త ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. కానీ, కేటుగాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా.. ఖాకీల ముందు అవి చిత్తవ్వాల్సిందేగా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించేశారు ఏపీ పోలీసులు. అసలు ఈ స్మగర్లు గంజాయిని ఎలా విక్రయించారు? పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది. ఆయుర్వేదం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆయుర్వేదం రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నరసరావుపేట పోలీసులు.. దాడులు చేసి గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఆయుర్వద రూపంలో ఉన్న చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కేటుగాళ్ల టార్గెట్ వీరే..
స్మగ్లర్లు.. పని చేసే కార్మికులు, చదువుతున్న విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒరిస్సాకు చెందిన ఉదయానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ వెల్లడించారు. గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు ఎస్పీ.
Also Read:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్..
నన్ను ఏం చేయలేరు.. రామ్ గోపాల్ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్
పాన్ కార్డ్ 2.O ని ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Dec 02 , 2024 | 07:35 PM