ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan Mohan : ఏం చేసినా స్కామే!

ABN, Publish Date - Nov 26 , 2024 | 02:51 AM

రివర్స్‌ టెండరింగ్‌ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్‌ మీటర్ల టెండర్లు... బైజూస్‌ ట్యాబ్‌లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే!

  • జగన్‌ జమానాలో అంతా ‘నాకేంటి’ లెక్కలే

  • ముడుపులిచ్చిన వ్యాపారవేత్తలకు రెడ్‌కార్పెట్‌

  • డీల్‌ సెట్‌ అయితే చాలు నిబంధనలేవీ ఉండవు

  • వేల కోట్ల టెండర్లు అప్పనంగా అప్పగించేయడమే

  • పోర్టుల నుంచి విద్యుత్తు మీటర్ల వరకు అదే లెక్క

  • నష్టాల్లో ఉన్న సంస్థలకు పిలిచి మరీ పనులు

  • అదానీ వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో పలు అనుమానాలు

  • నాటి సర్కార్‌లో కాంట్రాక్టులన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రివర్స్‌ టెండరింగ్‌ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్‌ మీటర్ల టెండర్లు... బైజూస్‌ ట్యాబ్‌లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే! వెరసి... ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాల్లో ప్రజా ప్రయోజనం ఎలా ఉన్నా... స్వీయ లాభమే కీలకంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో వివాదాస్పద వ్యాపారవేత్తలకు, ఇంకెక్కడా దిక్కులేని కంపెనీలకు తలుపులు తెరిచి రెడ్‌ కార్పెట్‌ పరిచి స్వాగతం పలికారు. ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రజలపై ఎంత భారం పడ్డా లెక్క చేయలేదు. తాజాగా సౌర విద్యుత్‌ కొనుగోలులో జరిగిన ముడుపుల బాగోతం అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ (సెక్‌), దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణలో బయటపడింది. దీంతో జగన్‌ జమానాలో పనులు దక్కించుకున్న సంస్థలు.. వాటికి అప్పగించిన కాంట్రాక్టులపై విచారణ జరపాలన్న డిమాండ్‌ ప్రజల్లో క్రమంగా ఉధృతమవుతోంది.


  • అదా.. నీ కహానీ

భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో గౌతం అదానీ ఓ దిగ్గజ పారిశ్రామికవేత్త. అయితే ఆయన వ్యాపార విస్తరణపై తొలి నుంచి విమర్శలు ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రిగా జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అదానీతో ఆయన కహానీ బాగా నడిచింది. ఇటీవల రూ. 1750 కోట్ల లంచాల వ్యవహారం బయటపడటంతో ఇతర వ్యవహారాలపై కూడా అందరి దృష్టి పడింది. గంగవరం పోర్టు అదానీకి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా పది శాతం రూ. 680 కోట్లనూ వదిలేసుకున్నారు. ఇప్పుడు ఈ వాటా విలువ రూ. 2,500 కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన ఈ డీల్‌లో ఎంత ప్రయోజనం ఆశించారో అంటూ రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉత్తరాంధ్రవాసి, వైసీపీ సీనియర్‌నేత బొత్స సత్యనారాయణతో సహా.. ఇతర నేతలెవరైనా గంగవరం పోర్టు అంశం వచ్చేసరికి నాలుక మడతపెట్టేస్తారు.

ఇక కృష్ణపట్నం పోర్టు నవయుగ నుంచి అదానీ పరమవ్వడం వెనుక చాలా తంతు దాగి ఉందంటూ మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. కృష్ణపట్నం పోర్టును ఆనుకుని ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్కేంద్రం కూడా అదానీకి అప్పగించేలా జగన్‌ పావులు కదిపారు. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలు అధికారుల్లోనూ. రాజకీయవర్గాల్లోనూ కదలిక తెచ్చాయి. ఉద్యమాలు ఉధృతమవ్వడంతో చేసేదిలేక కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రం అప్పగింత వ్యవహారం ఆపేశారు. ఇక వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్కేంద్రాలను అదానీకి జగన్‌ కట్టబెట్టారు.


కడప జిల్లా గండికోటలో 1,000 మెగావాట్లు, శ్రీసత్యసాయిజిల్లా చిత్రావతిలో 500 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లా కురుకుర్లిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో 1000 మెగావాట్లు, అనకాపల్లి జిల్లాలో పెదకోటలో 1500 మెగావాట్లు, విజయనగరం జిల్లా రైవాడలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా అప్పగించేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను కేటాయించాలి. రాష్ట్రానికి ఎవరు ఎక్కువ లబ్ధి చేకూరిస్తే వారికి ప్లాంటు స్థాపనకు అవకాశం ఇవ్వాలి. కానీ ఆ నిబంధనలేవీ పాటించలేదు. ఇక పట్టణ ప్రాంతాలో గృహాలకు విద్యుత్తు మీటర్లను అమర్చే బాధ్యతను పూర్తిగా అదానీకే ఇచ్చేశారు.

  • షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు ఎనలేని మేళ్లు

జగన్‌ పాలనలో అత్యధిక ప్రాధాన్యం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అధినేత విశ్వేశ్వరరెడ్డికి దక్కింది. అప్పటి వరకు అనామక సంస్థగా ఉన్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే పెద్దపెద్ద కాంట్రాక్టులు దక్కించుకుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే రెట్టింపు ధరలకు షిర్డీసాయి నుంచి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను జగన్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అవసరం లేకపోయినా ఇలా కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తినా జగన్‌కు చీమకుట్టినంత కూడా అనిపించలేదు. పైగా.. కొత్త కాంట్రాక్టులు కట్టబెడుతూనే ఉన్నారు. షిర్డీసాయి, ఇండోసోల్‌ సంస్థలకు కడప జిల్లాలో పైడిపాలెం నార్త్‌లో 1000 మెగావాట్లు, పైడిపాలెం ఈస్ట్‌లో 1200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్లు, ఎర్రకాలువ వద్ద 1200 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలు ఇచ్చేశారు. అదానీకి పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు మీటర్ల బాధ్యతలను అప్పగిస్తే .. షిర్డీసాయికి వ్యవసాయ విద్యుత్తు మోటార్ల బిగింపు బాధ్యతను జగన్‌ కట్టబెట్టారు.


  • బైజైస్‌కు బాధ్యతలా?

రాష్ట్రంలో అరబిందోకు పొర్టులూ, ఆరోగ్య సేవలు, 108 వాహన నిర్వహణ వంటి వాటిని జగన్‌ అప్పగించేశారు. ఇక ఆర్థికంగా చితికిపోయిన బైజూస్‌ చేతిలో రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును పెట్టేశారు. ఈ సంస్థకే విద్యార్ధులకు ట్యాబులను సరఫరా చేసే బాధ్యతనూ అప్పగించారు. ఈ ట్యాబులు అధిక ధరకు కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశీయంగా కార్యక్రమాలను నిలిపివేస్తూ వస్తోన్న బైజూ్‌సకు రాష్ట్ర విద్యార్థుల బాధ్యతలను అప్పగించడంపై జగన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా.. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఆ సంస్థను బహిరంగ సభల్లో జగన్‌ వెనుకేసుకొచ్చారు. ఇలా దివాలా అంచులనున్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, అయాచిత లబ్ధిని చేకూర్చడం వెనక మర్మమేంటో అమెరికాలోని అభియోగ పత్రంతో బహిర్గతమైందని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. ఈ కాంట్రాక్టులు, పనుల అప్పగింత వెనుక ఎన్ని కోట్లు చేతులు మారాయోనని చర్చించుకుంటున్నారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌ కథేంటో?

కడప స్టీల్‌ ప్లాంట్‌కు జగన్‌ రెండు సార్లు శంకుస్థాపనలు చేశారు. దాన్ని నిర్మించేందుకు తొలుత ముందుకొచ్చిన జేఎ్‌సడబ్ల్యూ సంస్థ అప్పటికే ఆర్థికంగా దివాలా తీసింది. తమకు ఆదుకోవాలంటూ ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి ఆ సంస్థ చేసిన అభ్యర్థనలు ఫలించలేదు. అలాంటి దివాలా తీసిన కంపెనీతో నిర్మాణానికి జగన్‌ శంకుస్థాపన చేయించారు. తర్వాత ఎన్నికలకు ముందు 2023 ఫిబ్రవరి 16న సజ్జన్‌ జిందాల్‌తో కడపలో దశ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేయించారు. రెండున్నరేళ్లలో 3000 కోట్లతో మొదటి పూర్తి చేస్తామని అప్పట్లో జగన్‌ ప్రకటించారు. ఇలా శంకుస్థాపనలు చేయడం వెనుక కథేంటోనని కడప జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 02:54 AM