ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న మరో కౌంటర్‌ వెయిట్‌

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:03 AM

ప్రకాశం బ్యారేజీలో మరో సిమెంటు దిమ్మె (కౌంటర్‌ వెయిట్‌) దెబ్బతిన్నట్లు గుర్తించారు. 67, 68, 69 నంబరు ఖానాలతో పాటు 66వ ఖానా వద్ద ఉన్న దిమ్మె కూడా దెబ్బతిందని.. పగుళ్లు ఉన్నాయని బెకెమ్‌ కంపెనీ బృందం గురువారం గుర్తించింది.

  • మొత్తం నాలుగు మార్చాలని నిర్ణయం హైదరాబాద్‌లో సిద్ధమైన వెయిట్లు

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీలో మరో సిమెంటు దిమ్మె (కౌంటర్‌ వెయిట్‌) దెబ్బతిన్నట్లు గుర్తించారు. 67, 68, 69 నంబరు ఖానాలతో పాటు 66వ ఖానా వద్ద ఉన్న దిమ్మె కూడా దెబ్బతిందని.. పగుళ్లు ఉన్నాయని బెకెమ్‌ కంపెనీ బృందం గురువారం గుర్తించింది. ఈ సమాచారాన్ని హైదరాబాద్‌లో ఉన్న జాతీయ హైడ్రాలిక్‌ గేట్ల నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడికి తెలియజేసింది. దీనిని మరమ్మతు చేసే వీలున్నా.. భవిష్యత్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా 66వ ఖానా కౌంటర్‌ వెయిట్‌నూ మార్చేయాలని ఆయన సూచించారు. గురువారం దాని కొలతనూ తీసుకున్నారు.

ఇక దెబ్బ తిన్న 67, 68, 69 ఖానాల వద్ద పాత కౌంటర్‌వెయిట్లను తొలగించారు. ఈ పనులను సీఈ కుమార్‌ పర్యవేక్షించారు. శుక్రవారం 66వ నంబరు వెయిట్‌ను కూడా తీసేస్తారు. ఇక 68, 69, 70 గేట్లను మూసేశారు. శుక్రారంనాడు 66, 67 గేట్లను కూడా మూసేస్తారు. 67, 68, 69 కౌంటర్‌ వెయిట్లు హైదరాబాద్‌లో సిద్ధమయ్యాయి. కన్నయ్యనాయుడు శనివారం వచ్చి... ఆదివారం కొత్త కౌంటర్‌ వెయిట్‌లను అమర్చుతారు. అనంతరం ఆ గేట్లు మామూలుగా పనిచేస్తాయని అధికార వర్గాలు తెలినాయి. ఈలోపు బ్యారేజీలో చిక్కుకున్న బోట్లను తొలగిస్తారు. ఇందుకోసం ఒక భారీ మరపడవను సిద్ధం చేస్తున్నారు. ప్రవాహ దిశకు ఎదురెళ్లి ఆ బోట్లను మరపడవకు కట్టి ్టలాగాలని నిర్ణయించారు.

Updated Date - Sep 06 , 2024 | 05:03 AM

Advertising
Advertising