AP CM Chandrababu : వచ్చే డిసెంబరుకే వాల్ పూర్తికావాలి
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:15 AM
2026 అక్టోబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా ఆలోపు పనులు పూర్తికి తగు కార్యాచరణను కూడా ఖరారుచేశారు. పనులను అత్యంత వేగంగా చేయాలని, ఎక్కడా జాప్యానికి తావుండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనులు2026 మేలోపే అయిపోవాలి
ఏడాదిన్నరలో కుడి, ఎడమ కాలువల పనులు
పోలవరం పనులకు కార్యాచరణ
ABN Andhrajyothy : 2026 అక్టోబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా ఆలోపు పనులు పూర్తికి తగు కార్యాచరణను కూడా ఖరారుచేశారు. పనులను అత్యంత వేగంగా చేయాలని, ఎక్కడా జాప్యానికి తావుండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సహాయ పునరావాస పనులను అంతే వేగంగా ఒక కొలిక్కివచ్చేలా చేయాలన్నారు.
డయాఫ్రం వాల్ నిర్మాణంతోపాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణం దిశగా ఏర్పాట్లు చేసుకోవాలి. తగినంత మెటీరియల్ సమకూర్చుకోవాలి. జనవరి 2వ తేదీ నుంచి డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు చేపట్టి వేగం పెంచాలి. 2026 మార్చి నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. 2025 డిసెంబరు నాటికే పూర్తి చేయాలి.
ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-1 2026 ఫిబ్రవరికి పూర్తికావాలి. గ్యాప్-2ని 2026 మేలోపే పూర్తి చేయాలి.
కుడి, ఎడమ కాలువల పనులు ఏడాదిన్నరలోనే పూర్తి కావాలి.
స్పిల్‌వే పనులన్నీ 2026జూన్‌లోపు పూర్తి చేయాలి.
పైలట్ ప్రాజెక్టు పనులు 2027లోపే పూర్తి కావాలి.
టన్నెల్స్ నిర్మాణం 2026 ఫిబ్రవరిలోపు పూర్తి కావాలి.
కుడికాలువ కనెక్టవిటీ 2026 డిసెంబరులోపే జరగాలి.
ఎక్కడా జాప్యం జరుగకూడదు. నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తయ్యేలా చూడాలి. ఆలోపే ఆర్‌అండ్‌ఆర్ పనులను సంపూర్తి చేయాలి.
16,450 ఎకరాల భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి కావాలి.
యుద్ధ ప్రాతిపదికన పనుల పూర్తికి క్షేత్ర స్థాయిలో నిర్దిష్ట ప్రణాళికలు ఉండాలి.
Updated Date - Dec 17 , 2024 | 03:15 AM