ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 09 , 2024 | 05:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి.. తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఇందులో కొందరు నేరుగా సీఎం సహాయ నిధికి ట్రాన్స్‌ఫర్ చేయగా.. మరికొందరు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కులు అందజేశారు. ఇలా సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకున్నారు. అయితే.. తాజాగా ఓ మారుమూల గ్రామంలోని స్కూల్ చిన్నారులు.. వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిట్టి చేతులతో పెద్ద సాయమే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.


చిట్టి చేతులకు ప్రశంస..

ఓ మారుమూల గ్రామంలో స్కూల్ చిన్నారుల పెద్ద మనసు చూసి సీఎం చలించిపోయారు. ఈ వీడియో నిజంగా తన విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల్లోకెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం, పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన ఈ చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శంగా నిలిచారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చి.. అసాధారణ కరుణను ప్రదర్శించారు. మొత్తం 31 వేల రూపాయలు సేకరించి అందించడం నిజంగా చాలా గ్రేట్. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను.అవసరం ఉన్న వారి పట్ల శ్రద్ధ వహించడం సాయం చేయడాన్ని వారికి బోధించడం చాలా గొప్ప విషయం. ఈ విలువలను విద్యార్థులు పాటించేలా చూసిన పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయిఅని ట్విట్టర్‌లో చంద్రబాబు అభినందించారు.


బట్టలు ఇస్తాం.. స్పందించండి

ఇదిలా ఉంటే.. సోమవారం సాయంత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. విజయవాడలోని ఉర్మలా నగర్, కవేలా సెంటర్, సింగ్ నగర్, పైపుల రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి.. వరద బాధితులను పరామర్శించారు.ఒక్కో ఇంటికి ఒక్కో జత బట్టలు ఇస్తాము. చాలామంది బట్టలు పోయాయి అని చెబుతున్నారు. చెడిపోయిన వస్తువులను బాగు చేసేందుకు అర్బన్ కంపెనీకి బాధ్యతలు అప్పగిస్తాం. ఇన్సురెన్స్ క్లయిమ్ పెడితే వెంటనే ఇప్పిస్తాం. IVRS కాల్స్‌కు రెస్పాండ్ కావాలి. మీరు ఫీడ్ బ్యాక్ ఇస్తేనే మాకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుంటుందిఅని వరద బాధితులకు సీఎం సూచించారు.

Updated Date - Sep 09 , 2024 | 05:50 PM

Advertising
Advertising