K Rammohan Naidu: సీఎంతో ముగిసిన భేటీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 22 , 2024 | 08:21 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా .. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అమరావతి, నవంబర్ 22: గత ఐదేళ్లలో వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బ తీశారని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. గత సీఎం వైఎస్ జగన్ చర్యల వల్ల.. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయని ఆయన విమర్శించారు. అయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
AP Assembly: పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి ఊతం
శుక్రవారం ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్.. ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు.
Also Read: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా
ఈ విజన్ డాక్యుమెంట్‌కు కేంద్ర సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా చేసుకుని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఎలా తీసుకు రావాలనేది ఒక డాక్యుమెంట్‌తో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సెకి ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలిస్తోందన్నారు.
Also Read: సీసీ టీవీలపై అసత్య ప్రచారం.. రంగంలోకి దిగిన భారతీయ రైల్వే
ఆ క్రమంలో న్యాయ నిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్ట వచ్చా అనే అంశాన్నిసైతం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Also Read: స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం
లోక్‌సభలో టీడీపీ నేత లావు కృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు తీసుకు వస్తామన్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణాన్నిసైతం ముందుకు తీసుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమిలో పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు.. ఈ సమావేశాల్లో సమయానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. ఏపీ ఎంత అప్పుల ఊబిలో ఉందనే విషయాన్ని గత సమావేశాల్లోనే పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లామని ఈ సందర్భంగా ఎంపీ లావు కృష్ణదేవరాయులు గుర్తు చేశారు.
Also Read: ఎండు కొబ్బరి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సైతం ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీల పని తీరు పట్ల.. సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ తమ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో మరింత సమన్వయంగా కలిసి పని చేసుకోవాలని ఎంపీలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎంపీలకు అప్పగించిన శాఖల బాధ్యతలు.. సంబంధిత మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.
ఇక ఈ సమావేశంలో ఎంపీ అప్పలనాయుడు గురించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎంపీ అప్పలనాయుడు.. బయట ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడని పేర్కొన్నారు. అప్పలనాయుడు ఇంతలోనే షర్టు మార్చావా? అంటూ సీఎం చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు.
For Andhra pradesh News And Telugu News
Updated Date - Nov 22 , 2024 | 08:29 PM