ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP DSC: ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2024-02-07T15:48:52+05:30

Andhrapradesh: నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తూ ఏపీలో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 7: నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తూ ఏపీలో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుండగా... ఏప్రిల్ 7తో ముగియనుంది. మొత్తం ఏడు మేనేజ్మెంట్‌లలో ఉన్న స్కూల్స్‌లోని 6100 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఎస్‌ఈటీ - 2280 , స్కూల్ అసిస్టెంట్స్ - 2299, టీజీటీ - 1264, పీజీటీ - 215, ప్రిన్సిపల్స్ - 42 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుండగా.. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి చెప్పారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల అవుతుందన్నారు. అలాగే ఏప్రిల్‌ 1న కీ లో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్‌ 2వ తేదీన ఫైనల్‌ కీ విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - 2024-02-07T16:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising