AP News: కేంద్ర మంత్రి నిర్మలను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Dec 17 , 2024 | 08:17 PM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భేటీ అయ్యారు. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన పయ్యావుల కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భేటీ అయ్యారు. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన పయ్యావుల కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు విడుదల చేయాలని మంత్రి పయ్యావుల విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అవసరమని నిర్మల దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. అలాగే గత ఐదేళ్లలో దాదాపు 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయలేదని, ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్‌కు మంత్రి వివరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 73 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీలో పునరుద్ధరించినట్లు ఆయన చెప్పారు. గత ఐదు నెలల కాలంలో 73 కేంద్ర పథకాలకు ఏపీ ప్రభుత్వ వాటా సమకూర్చినందున.. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేశవ్ కోరారు. కేంద్రం నుంచి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు సైతం విడుదల చేయాలని, వీటితోపాటు వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంటునూ వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rain Alert: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం..
Nellore: నెల్లూరుకు మహర్దశ.. మంత్రి నారాయణ ఏం చెప్పారంటే..
Updated Date - Dec 17 , 2024 | 08:20 PM