ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హామీల అమలుపై తెలంగాణ సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:30 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు.

పథకాల లబ్ధిదారుల లెక్కలు తీయడంలోనే ఏడాది గడిపేశారు

ఆరోగ్య బీమా అమలు చేయట్లేదు.. ఉపాధి కల్పనలోనూ విఫలం

‘మహా’ ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యకుమార్‌ ఆరోపణలు

ముంబై, నవంబరు 17: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహా వికాస్‌ అఘాడీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. గత ఏడాది కాలంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పథకాల లబ్ధిదారుల లెక్కలు తీస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. సీనియర్‌ సిటిజన్లకు రూ.4వేలు పింఛను ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారని, కానీ ఏడాది గడిచినా ఇంకా లబ్ధిదారులను గణించే ప్రక్రియ కొనసాగుతునే ఉందని పేర్కొన్నారు.

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం సీనియర్‌ సిటిజన్ల పెన్షన్‌ను రూ.3వేల నుంచి రూ.4వేలకు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ3.వేల నుంచి రూ.6 వేలకు పెంచిందని గుర్తుచేశారు. గ్యాస్‌ సిలిండర్‌కు రూ.500 ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దీనికీ లబ్ధిదారుల గణన పూర్తికాలేదని తెలిపారు. ఏపీలో ప్రజలకు మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామని, దీపావళికి 1.55 కోట్ల మందికి మొదటి సిలిండర్‌ అందించామని వివరించారు. ఉపాధి కల్పనలోనూ తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, ఆరోగ్య బీమాను కూడా అమలు చేయడంలేదని సత్యకుమార్‌ ఆరోపించారు.

Updated Date - Nov 18 , 2024 | 04:31 AM