ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీట్లు పొందని అభ్యర్థులతో భర్తీ చేయండి

ABN, Publish Date - Nov 29 , 2024 | 05:54 AM

అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, కర్నూలులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీల్లో 76 సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

  • కోనసీమ, కర్నూలు వైద్య కాలేజీల్లో పెరిగిన సీట్లపై హైకోర్టు

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, కర్నూలులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీల్లో 76 సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద సీట్లు కేటాయించని అభ్యర్థులందరినీ అనుమతిస్తూ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఉత్తర్వులు ఆ 76 సీట్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేసింది. ఈ సీట్ల భర్తీతో బీడీఎస్‌ విభాగంలో ఏర్పడే ఖాళీలను ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్‌ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Nov 29 , 2024 | 05:54 AM