ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లు ఎప్పుడో..!?

ABN, Publish Date - Aug 05 , 2024 | 09:24 AM

గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధి దారులకు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునే అవకాశం ఉండేది.. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇదే పెద్ద ప్రహసనంలా మారింది. ఆరు నెలలకు ఒకసారి..

CM Nara Chandrababu Naidu

అమరావతి/గుంటూరు : గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధి దారులకు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునే అవకాశం ఉండేది.. అయితే వైసీపీ (YSRCP) ఐదేళ్ల పాలనలో ఇదే పెద్ద ప్రహసనంలా మారింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం దక్కేది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో తమకు అవకాశం ఎప్పటికి దక్కుతుందో.. ఎప్పటి నుంచి పింఛన్ల లబ్ధి పొందుతామని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎదురు చూస్తోన్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశంపై కొండంత ఆశతో లబ్ధిదారులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశంలేక పింఛనుకు దూరమైన అనేక మంది కూటమి ప్రభుత్వం రాకతో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు పింఛను మొత్తాన్ని కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచేసింది. మరోవైపు వైసీపీ హయాంలో నిబంధనల వడపోతతో అనర్హత బారినపడి పింఛన్లు కోల్పోయిన వేలాది మంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నా రు. వెరసి పింఛన్ల కోసం ఎదురు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది.


నిరంతర ప్రక్రియగా నాడు నమోదు

2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైన పింఛను కోసం దరఖాస్తు చేసుకునే వీలుండేది. వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు జాబితాను సిద్ధం చేసేవారు. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పింఛను పొందే అవకాశం ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి చెప్పింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితా రూపొందించే విధానం తెచ్చింది. ప్రతి ఏడాది జూన్‌, డిసెంబరు నెలల్లోనే జాబితా రూపొందిస్తామని చెప్పింది. అయితే గడిచిన ఐదేళ్లలో ఒక్క సారి కూడా ఆ ప్రకారం జాబితాలను రూపొందించిన దాఖలాలు లేవు. గతంలో టీడీపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల నమోదును నిరంతర ప్రక్రియగా చేస్తే వైసీపీ ప్రభుత్వం తొలగింపులను నిరంతర ప్రక్రియగా చేసుకుంది. విద్యుత్‌, ఇన్‌కమ్‌ టాక్స్‌, నాలుగు చక్రాల వాహనం, ఇళ్ల స్థలం, పొలం తదితరాల పేరుతో వేలాదిమందిని పింఛను పథకానికి అనర్హులను చేసి తొలగించారు. పొరపాటున తిరస్కరణకు గురైతే మరో ఆరు నెలలు ఆగాల్సి వచ్చేది. ఇలా అర్హులైన లబ్ధిదారులు వేలాది మంది ఏళ్లకు ఏళ్లు పింఛను కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి వారంతా కూటమి ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్నారు.


నిర్ణయంపై ఎదురు చూపులు

కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ కోసం పలువురు ఎదురు చూస్తున్నారు. అనేక మంది ఒక చోట నుంచి వేరొక చోటికి మారినవారు ఉన్నారు. వారు కూడా పింఛనును తాము ప్రస్తుతం నివాసం ఉండే చోటికి బదిలీ చేసుకోవాలని చూస్తున్నారు. వీటిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 09:26 AM

Advertising
Advertising
<