ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : ‘రుషికొండ’.. గుదిబండ!

ABN, Publish Date - Oct 20 , 2024 | 02:57 AM

తాను 30 ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్న నాటి ముఖ్యమంత్రి జగన్‌.. తన కుటుంబం కోసం విశాఖ రుషికొండపై రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతమైన ప్యాలె్‌సను నిర్మించుకున్నారు.

  • ప్యాలెస్‌పై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన.. గత ప్రభుత్వంలో 500 కోట్లతో నిర్మాణం

  • జగన్‌ కోసం ప్రజాధనం దుర్వినియోగం

  • పర్యాటకం పేరుతో అడ్డగోలు పనులు

  • 4.5 ఎకరాల్లో విలాసవంతంగా 5 బ్లాక్‌లు

  • నేడు నిర్వహణే భారంగా మారిన వైనం

  • 85 లక్షల వరకు విద్యుత్‌ బకాయిలు

  • భవనాల వినియోగంపై అయోమయం

  • ఎంబసీ కార్యాలయాలు, పారిశ్రామిక అవసరాలకు వాడాలని నిపుణుల సూచన

  • గ్లోబల్‌ టెండర్లు పిలవాలనీ అభిప్రాయాలు

  • ప్రజలు సూచనలు ఇవ్వాలన్న లోకేశ్‌

గత ప్రభుత్వంలో రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్‌ నిర్మించారు. ఒక వ్యక్తి (జగన్‌) బతకడానికి అంత డబ్బుతో ప్యాలెస్‌ అవసరమా? ఆ సొమ్ముతో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లు పూర్తి చేసి పేద వర్గాలకు అందజేయవచ్చు. రుషికొండ ప్యాలెస్‌ను ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రజలు సూచనలు ఇవ్వాలి.

- మంత్రి లోకేశ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తాను 30 ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్న నాటి ముఖ్యమంత్రి జగన్‌.. తన కుటుంబం కోసం విశాఖ రుషికొండపై రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతమైన ప్యాలె్‌సను నిర్మించుకున్నారు. చట్టాలను ధిక్కరించి, నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రజాధనం దుర్వినియోగం చేశారు. జగన్‌ చేసిన నిర్వాకానికి ఇప్పుడు ఈ ప్యాలె్‌సను ఏం చేయాలో కూటమి సర్కారుకు అంతుచిక్కడం లేదు. ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాక కిందా మీదా పడుతోంది. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవు. కన్వెన్షన్‌ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదు.

అధికారుల సమావేశాలకు ఉపయోగించుకుందామన్నా చాలా భారమవుతుంది. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణే రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ భవనాలను వినియోగిస్తే కేవలం విద్యుత్‌ బిల్లులే నెలకు రూ.25 లక్షల వరకు వస్తాయి. ఇతర నిర్వహణ ఖర్చులూ ఉంటాయి. ఈ మొత్తాన్ని భరించగల ఆర్థిక స్థోమత కలిగిన సంస్థకు మాత్రమే అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్‌ వినియోగంపై కూటమి సర్కారు తర్జన భర్జన పడుతోంది. దీనిపై నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


  • నాడు ఏం చేశారంటే..

రుషికొండపై ప్యాలెస్‌ కట్టడం కోసం అక్కడ ఉన్న పర్యాటక శాఖ కాటేజీలను కూల్చివేశారు. పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదు. 4.5 ఎకరాల్లో భవనాల నిర్మాణం కోసం 22 ఎకరాల మేర కొండను ఇష్టానుసారం తవ్వేశారు. ఐదు ఎకరాల్లో వేలాది మొక్కలతో ల్యాండ్‌ స్కేపింగ్‌, బ్యూటిఫికేషన్‌ పనులు చేపట్టారు. పర్యాటకుల కోసం ఏడు నక్షత్రాల హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, గదులు నిర్మిస్తామని మభ్యపెట్టి ఐదు బ్లాకుల్లో పడక గదులు, డైనింగ్‌, లివింగ్‌ రూమ్‌లు, సమావేశ మందిరాలు నిర్మించుకున్నారు. రాజభవనంలా విశాలంగా, విలాసంగా నిర్మించారు. ఐదు బ్లాకుల భవనాలను 1,48,413 చ.అ. విస్తీర్ణంలో నిర్మించారు. చదరపు అడుగుకు సగటున రూ.30 వేలు ఖర్చు చేశారు. కొన్ని భవనాలకు మాత్రమే ఫర్నీచర్‌ సమకూర్చారు. ఈలోగా ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోవడంతో అవన్నీ ఆగిపోయాయి. వాటి కోసం కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ ఎక్కడుందో కూడా తెలియడం లేదు.

  • విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌

గత ఏడాది నవంబరు నుంచి రుషికొండ ప్యాలె్‌సకు విద్యుత్‌ వినియోగిస్తున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున రూ.7 లక్షల విద్యుత్‌ బిల్లు వస్తోంది. విద్యుత్‌ బిల్లులు చెల్లించ క ఇప్పటి వరకు దాదాపు రూ.85 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. ఆ భవనం ఆవరణలో కేవలం రాత్రిపూట విద్యుద్దీపాలు వెలిగించినందుకే ఈ మొత్తంలో బిల్లు వచ్చింది.

  • కార్పొరేట్‌ సమావేశాలకైతే...

విశాఖపట్నంలో వివిధ పరిశ్రమలు, విద్యా సంస్థలకు సంబంధించి తరచూ భారీ కార్పొరేట్‌ సమావేశాలు జరుగుతుంటాయి. అటువంటి వాటికి ఈ భవనాలు ఉపయోగించుకుంటే బాగుంటుందని విశాఖకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు సూచించారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీటీడీసీ పర్యాటక ఆస్తులను లీజుకు ఇచ్చినట్టు దీనిని కూడా ఇస్తే ప్రభుత్వానికి భారమే తప్ప రూపాయి ఆదాయమూ రాదు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.


  • లోపల ఏముందో..?

ఈ భవనాల లోపల ఎలా ఉంది? అని తెలుసుకోవడానికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రభుత్వం అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్‌ కూడా ఇప్పటి వరకూ లోపలకు వెళ్లి చూడలేదు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రమే ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలలోనే వెళ్లి చూశారు. ఆ తరువాత తాళాలు వేశారు. మళ్లీ తెరవలేదు. దాదాపు రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్‌ వినియోగానికి గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించాలని, ఆసక్తితో ముందుకు వచ్చే సంస్థల ప్రతినిధులకు దానిని చూపించే ఏర్పాట్లు చేయాలని పారిశ్రామికవేత్తలు సూచిస్తున్నారు.

  • ప్రస్తుత పరిస్థితి ఇదీ

  • రుషికొండ ప్యాలె్‌సను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు (ఏపీటీడీసీ) అప్పగించారు. ఈ భవనాల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదు.

  • ప్రస్తుతం భవనాలకు తాళాలు వేసి ఉంచారు. కాపలాగా సెక్యూరిటీని పెట్టారు.

  • పది నెలలుగా నిర్వహణ లేకపోవడంతో భవనాలు దుమ్ము పట్టేశాయి. కొన్ని ఉపకరణాలు తుప్పు పట్టేశాయి. నీరు పోసేవారు లేక మొక్కలు ఎండిపోతున్నాయి.

  • సముద్రాన్ని ఆనుకొని ఉండడంతో ఉప్పు నీటి గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

  • సరైన నిర్వహణ లేకపోతే కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన గృహోపకరణాలు పాడైపోయే అవకాశం ఉంది.


  • ఎంబసీ కార్యాలయాలకు ఇస్తే మేలు

రాష్ట్రంలో వీసా ఫెసిలిటేషన్‌ సర్వీస్‌ సెంటర్‌ లేదు. హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోంది. రుషికొండలోని ఐదు భవనాల్లో ఒక దానిని ఇందుకోసం కేటాయిస్తే బాగుంటుంది. సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌, అమెరికా తదితర దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి, పెట్టుబడులు తెప్పించుకోవడానికి వీలుగా రెండు భవనాలను డిప్యూటీ హై కమిషనర్‌ కార్యాలయాలకు ఇవ్వాలి. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పనిచేస్తున్న ఏపీ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డును ఇక్కడే పెట్టాలి. ఇంకో భవనాన్ని ఐటీ ప్రమోషన్స్‌కు వినియోగించుకుంటే మేలు.

- ఒ.నరేశ్‌కుమార్‌, సీఈఓ, సింబయోసిస్‌ టెక్నాలజీస్‌

  • వేసవి ‘అసెంబ్లీ’కి అనువైన ప్రాంతం

వేసవిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ అనువుగా ఉంటుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజా ప్రతినిధులు విశాఖపట్నం చూసినట్టు, సాగర తీరాన సేద తీరినట్టు అవుతుంది. విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం సర్క్యూట్‌ హౌస్‌ పాతబడి పో యింది. కొత్తది నిర్మించే ప్రతిపాదనలు లేవు. రుషికొండలో కనీసం రెండు భవనాలు అయి నా అతిఽథుల కోసం కేటాయిస్తే బాగుంటుంది.

- జి.సాంబశివరావు, పూర్వ అధ్యక్షుడు, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

Updated Date - Oct 20 , 2024 | 02:57 AM