ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atchannaidu: అదీ న్యూస్ రంగంలో శాంతిస్వరూప్ ముద్ర

ABN, Publish Date - Apr 05 , 2024 | 01:03 PM

Andhrapradesh: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. శాంతిస్వరూప్ వార్తలు చదివితే చదవినట్లుగా కాక.. చెప్పినట్లుగా ఉండేవన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు తెలుగు వార్తలను చదివి తెలుగు భాషకే వన్నె తెచ్చిన చిరస్మరణీయుడు శాంతిస్వరూప్ అని కొనియాడారు.

అమరావతి, ఏప్రిల్ 5: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) అన్నారు. శాంతిస్వరూప్ వార్తలు చదివితే చదవినట్లుగా కాక.. చెప్పినట్లుగా ఉండేవన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు తెలుగు వార్తలను చదివి తెలుగు భాషకే వన్నె తెచ్చిన చిరస్మరణీయుడు శాంతిస్వరూప్ అని కొనియాడారు. టెలీప్రాంప్టర్ లేని రోజుల్లో కేవలం స్క్రిప్టు పేపర్ల ఆధారంగా వార్తలు చదివిన శాంతిస్వరూప్ నేటి యువతకు ఎంతో ఆదర్మనీయులన్నారు. శాంతి స్వరూప్ వార్తలు చదివితే అవి చదివినట్లు కాక చెబుతున్నట్లుగా ఉండేవని.. అదీ న్యూస్ రంగంలో శాంతిస్వరూప్ ముద్ర అని చెప్పుకొచ్చారు. అలాంటి తెలుగుజాతి ముద్దుబిడ్డ శాంతి స్వరూప్ ఆత్మకు శాంతికలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తునానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Credit Card: క్రెడిట్ కార్డ్‌ ఉపయోగం వల్ల 10 లాభాలు.. అవి ఏంటంటే


గుండెపోటుతో కన్నుమూత..

ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు. రెండురోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను యశోదా ఆస్పత్రిలో తరలించారు. అయితే చికిత్స పొందుతూ శాంతి స్వరూప్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. తెలుగు తొలి న్యూస్‌ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. అంతేకాదు.. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు. శాంతిస్వరూప్.. 1983 నవంబర్ నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదివారు. 2011లో దూరదర్శన్‌లో పని చేసిన ఆయన.. ఆ తరువాత పదవీ విరమణ చేశారు. న్యూస్ రీడర్‌గా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

Viral Video: ఏంటీ.. కాఫీ తయారుచేసిన వీడియోకు ఏకంగా 56మిలియన్ల వ్యూసా.. ఇంతకీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 01:37 PM

Advertising
Advertising