AP News: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్
ABN, Publish Date - Mar 08 , 2024 | 09:27 PM
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. సీట్ల సర్దుబాటు అంశంపై కొద్ది సమయంలో బీజేపీ పెద్దలతో చర్చించి ఉమ్మడి ప్రకటన చేస్తామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని గ్రహించి తమ సహకారం కోసం బీజేపీ పెద్దలు ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. గతంలో అమిత్ షా, నడ్డాను కలిసి అవగాహనకు వచ్చామని వివరించారు.
శ్రీకాకుళం: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ, (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) మూడు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. సీట్ల సర్దుబాటు అంశంపై కొద్ది సమయంలో బీజేపీ పెద్దలతో చర్చించి ఉమ్మడి ప్రకటన చేస్తామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని గ్రహించి తమ సహకారం కోసం బీజేపీ పెద్దలు ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. గతంలో అమిత్ షా, నడ్డాను కలిసి అవగాహనకు వచ్చామని వివరించారు. ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు కాదని, 5 కోట్ల మంది ప్రజలకు ప్రజాస్వామ్యానికి దుర్మార్గుడైన జగన్ రెడ్డి మధ్య జరుగుతున్న ఎన్నిక అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నానని అన్నారు.
జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉందన్నారు. ఓటు చీలకూడదని, ఐదుకోట్ల ఆంధ్రుల ప్రయోజనల దృష్ట్యా తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టకున్నాయని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ఎండల మల్లిఖార్జున స్వామిని కుంటుంబ సమేతంగా అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. స్వతంత్ర భారతంలో మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లోని 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వం, జగన్ కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని రాజకీయ పార్టీలు ఎదురుచూసేవని, కానీ చరిత్రలో మొదటి సారిగా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఎంత తొందరగా వదులుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. అందుకే రాజకీయ పార్టీలు కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని వైఎస్సార్‌సీపీని హెచ్చరించారు. ఈ దుర్మార్గమైన పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
TDP - AP Politics: ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ముఖ్యనేతలకు ఫోన్లు చేసి...
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 08 , 2024 | 09:29 PM