AP News: అప్పన్న నిజరూప దర్శనానికి నేటి నుంచి టికెట్ల విక్రయం
ABN, Publish Date - May 03 , 2024 | 10:54 AM
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి ఈ నెల 10న నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకై ఈరోజు నుంచి 7 వరకు టికెట్లు అమ్మకాలు జరుగనున్నాయి. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి నిజరూప దర్శన టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభంకానుంది.
విశాఖపట్నం, మే 3: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Appanna Temple) ఈ నెల 10న నిజరూపంలో భక్తులకు (Devotees) దర్శనం ఇవ్వనున్నారు. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకై ఈరోజు నుంచి 7 వరకు టికెట్లు అమ్మకాలు జరుగనున్నాయి. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి నిజరూప దర్శన టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రూ.300, రూ.వెయ్యి టికెట్లు బ్యాంకుల ద్వారా, సింహగిరిపై టికెట్ల విక్రయ కేంద్రాల ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్
దేవస్థానంలో కౌంటర్లతో పాటు నగరంలోని పలు బ్యాంకు శాఖల ద్వారా చందనోత్సవం టికెట్లు అమ్మకాలు జరుగనున్నాయి. టికెట్లు కావల్సిన భక్తులు ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని.. ఒక దరఖాస్తుపై నాలుగు టికెట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఈ టికెట్ల విక్రయం నిలిపివేయనున్నారు. 10వ తేదీన చందనోత్సవం రోజున కూడా భక్తులకు దర్శనం టికెట్లు లభించవని దేవస్థానం స్పష్టం చేసింది. ఈ టికెట్లు లేని భక్తులను ఉచిత దర్శనం క్యూలైన్ల ద్వారా మాత్రమే అనుమతి ఉండనుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో దేవస్థానం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
Hyderabad: ‘మహా’ అధికారికి ఏసీబీ నోటీసులు.. ఇప్పటికే పలు దఫాలుగా వివరణ
YS Sharmila: వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం..
Read Latest AP News And Telugu News
Updated Date - May 03 , 2024 | 11:05 AM