ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Durgamma temple: ఆషాడమాసోత్సవాలు.. దుర్గమ్మకు తొలిసారెను సమర్పించిన వైదిక కమిటీ

ABN, Publish Date - Jul 06 , 2024 | 11:46 AM

Andhrapradesh: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాడ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు.

Vijayawada Kanakadurgamma Temple

విజయవాడ, జూలై 6: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ (Kanaka durgamma temple) సన్నిధిలో ఆషాడ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చలిమిడి, గోరింటాకును భక్తులు సమర్పించారు. ఆషాడ మాసం తొలిరోజు కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది.

Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..


ఆషాడ మసోత్సవాల సందర్భంగా నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడనుంది. అలాగే అమ్మవారికి శివ స్వామి సారెను సమర్పించారు. 116 మంది భక్తులతో కలిసి వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆషాడ మాసం నెలరోజుల పాటు అమ్మవారికి భక్తులు సారెను సమర్పించనున్నారు. ఆషాడ మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మను సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.


ఇవి కూడా చదవండి...

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...

GHMC: ఉద్రిక్తంగా జీహెచ్ఎంసీ సమావేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 11:46 AM

Advertising
Advertising