ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sri Bharat: వైసీపీది పేదల ప్రభుత్వం కాదు.. పేదరికంలో ముంచే ప్రభుత్వం..

ABN, Publish Date - May 03 , 2024 | 10:01 PM

వైసీపీది పేదల ప్రభుత్వం కాదని.. పేదరికంలో ముంచే ప్రభుత్వమని టీడీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. శుక్రవారం విశాఖ కంచరపాలెంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో శ్రీ భరత్ పాల్గొన్నారు.

విశాఖపట్నం: వైసీపీది పేదల ప్రభుత్వం కాదని.. పేదరికంలో ముంచే ప్రభుత్వమని టీడీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. శుక్రవారం విశాఖ కంచరపాలెంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో శ్రీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్లు.. ఎవరు ప్రశ్నిస్తే వాళ్లని వేధిస్తున్నారని, రేపు మీరు ప్రశ్నించినా మిమ్మల్ని కూడా వదలరని చెప్పారు. ప్రభుత్వాన్ని మార్చకపోతే మీరే నష్టపోతారంటూ ప్రజలను హెచ్చరించారు. క్లాస్‌కి, మాస్‌కి.. అందరికీ దగ్గర మనిషి బాలయ్య అని.. ఆయన తన మనసులో ఏది ఉంటుందో నోటితో అదే చెబుతారని పేర్కొన్నారు.


చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి జరిగింది..

విశాఖ అభివృద్ధి మొత్తం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే జరిగిందని.. ఆ పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు అన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో ఆయన మాట్లాడుతూ మరో నెల రోజుల్లో ప్రభుత్వం మారబోతుందని, మళ్లీ విశాఖ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దుర్మార్గ పాలన చేస్తున్నారు..

ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో రాక్షస పాలన, దుర్మార్గ పాలన సాగుతోందని టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి విష్ణు కుమార్ రాజు అన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో ఆయన మాట్లాడుతూ శాంతికి సంకేతంగా ఉన్న విశాఖలో జగన్ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని చెప్పారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేద్దాం అనుకుంటే, ఏపీకి ఉరితాడు వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 03 , 2024 | 10:01 PM

Advertising
Advertising