TDP : టీడీపీ పాలనలోనే బలిజలకు సంపూర్ణ గౌరవం
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:57 PM
టీడీపీ అధికారంలో ఉండగా బలిజలను ఎంతో గౌరవిచిందని, కాపు కార్పొరేషన ద్వారా అనేక సంక్షేమపథకాలు, విదేశీ విద్యతో వారి అభివృద్ధికి తోడ్పడిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గో రంట్లలోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షన హాల్‌లో మంగళవా రం బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సవితో పాటు ఎన్నిక పరిశీలకులు నరసింహరావు రాయల్ హాజరయ్యారు. ఈసందర్భంగా బలిజ సం ఘం నాయకులు వారిని ఘనంగా సన్మానించారు.

కూటమి ఎమ్మెల్యే అభ ్యర్థి సవిత
గోరంట్ల, ఏప్రిల్ 23: టీడీపీ అధికారంలో ఉండగా బలిజలను ఎంతో గౌరవిచిందని, కాపు కార్పొరేషన ద్వారా అనేక సంక్షేమపథకాలు, విదేశీ విద్యతో వారి అభివృద్ధికి తోడ్పడిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గో రంట్లలోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షన హాల్‌లో మంగళవా రం బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సవితో పాటు ఎన్నిక పరిశీలకులు నరసింహరావు రాయల్ హాజరయ్యారు. ఈసందర్భంగా బలిజ సం ఘం నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. బ లిజ భవన నిర్మాణం, శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ఏ ర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని నరసింహ రావు తెలిపారు.
అనంతరం సమిత మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వస్తే లేపాక్షి నాల్జెడ్ హబ్ భూము లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వా టిపై ఉన్న అప్పులు చెల్లించి, ఇండస్ర్టియల్ హబ్‌గా తీ ర్చిదిద్ది, వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా మన్నారు. సాయం చేయడమే తమ తమ కుటుంబం నైజమని ప్రజల నమ్మకాలను నేవేరుస్తానన్నారు. తనను, పార్థసారఽథిని గెలిపించాలని కోరారు. బలిజ క మ్యూనిటీ భవనం, రాయల ఉత్సవాలు, శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో చరిత్ర కారుడు మైనాస్వామి, టీడీపీ కన్వీనర్ సోముశేఖర్, బలిజ నాయకులు డాక్టర్ రవి తేజ, లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, సంతోష్, నారాయణ స్వామి, శ్రీనివాసులు, పులేరు శీనా, నరసింహమూర్తి, బాలాజీరాయల్, మల్లికార్జున తదితరులున్నారు.
టీడీపీలోకి 150కుటుంబాలు చేరిక
పెనుకొండ టౌన: గోరంట్ల మండలానికి చెందిన సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆ మండలం నుంచి 150 కు టుంబాలు టీడీపీలో చేరారు. పెనుకొం డలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత వారికి మంగళ వారం కండువాలువేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పరిగి మండలం విట్టాపల్లికి చెందిన వైసీపీ మాజీ సర్పంచ సత్యనారాయణరెడ్డి, ప్రస్తుత వార్డు సభ్యుడు రాజగోపాలరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
నేడు సవిత నామినేషన
పెనుకొండ టౌన/ హిందూపురం అర్బన : టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత నామినేషన బుధవారం భారీ జనంద్రం మధ్య వేయనున్నారు. పెనుకొండ రామభద్రాలయం వద్ద నుంచి ఉదయం 9 గంటలకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన వేయను న్నారు. ఈ నామినేషనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఆశీర్వదించాలని సవిత కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....