ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

ABN, Publish Date - Sep 22 , 2024 | 07:03 PM

జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.

ఒంగోలు, సెప్టెంబర్ 22: జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.

Also Read: Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..


ఆదివారం ఒంగోలు‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీ అభివృద్ధి కోసం తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా తాను పని చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్న ఇబ్బందుల వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

Also Read: Viral Video: భారత్‌లో సరే.. చైనాలో జనరల్ రైలు బోగీలో ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?


టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలపై పక్షం రోజుల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశానన్నారు. తనపై విచారణ జరిపితే అందుకు తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని తెలిపారు. టీడీపీ నేత, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలపై బాలినేని ఈ సందర్భంగా స్పందించారు.

Also Read: Rail Track: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం


అవి మంచి పద్దతి కాదన్నారు. ప్రశ్నించే పార్టీ.. జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఏమైనా తప్పులు జరిగితే తాను సైతం ప్రశ్నిస్తానని ఆయన పేర్కొన్నారు. లోకల్‌గా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారని.. ఈ నేపథ్యంలో దామచర్ల జనార్దన్ ఆయన పని ఆయన చేసుకుంటారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన పార్టీ నేతలకు తాను సూచించబోనని స్పష్టం చేశారు.

Also Read: YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు


అయితే ఒంగోలులో ఫ్లెక్సీలు ఎవరు కట్టారో తనకు తెలియదన్నారు. టిడిపి ఎమ్మెల్యే జనార్దన్ ఫోటోలు ఉన్నాయని ఫ్లెక్సీలు తొలగించారని చెప్పారు. ఎమ్మెల్యే జనార్దన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు పెట్టుకోవాలని తన వాళ్లకు చెబుతానని బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక వైసీపీకి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోలేదు. అదీకాక పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలి వల్లే పార్టీ ఓటమికి కారణమని పార్టీలోని కీలక నేతలు భావిస్తున్నారు. ఆ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి,సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో గురువారం జనసేనలో చేరుతున్నట్లు బాలినేని ప్రకటించారు. ఇక సామినేని, కిలారు రోశయ్య సైతం గురువారం జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం సాగుతుంది.

For More AndhraPradesh News And Telugu News..

Updated Date - Sep 22 , 2024 | 07:12 PM