Sankranthi: ఊరు వెళ్లిన పందెం రాయుళ్లు కాస్త జాగ్రత్త..!
ABN, Publish Date - Jan 15 , 2024 | 12:11 PM
కోడి పందాలే కాదు గుండాట వల్ల కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు మరికొంత కావాలని ఆశతో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవాలని ఆడతారు. పోయిన మనీ కోసం ఆడుతుంటే తిరిగి రావు. దీంతో జేబులు ఖాళీ అవుతుంటాయి.
అమరావతి: సంక్రాంతి (Sankranthi) అంటే ఆ సందడే వేరు. కల్లాపి చల్లి రంగవల్లులతో మహిళలు బిజీగా ఉంటారు. గాలి పటాలు ఎగరవేస్తూ ఆనందంగా గడుపుతారు పిల్లలు. ఇక పురుషుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోడి పందాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. డబ్బులు రాగానే మళ్లీ మళ్లీ పందెం కాస్తుంటారు. అలా కోడి పందాలతో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు.
ఆశతో ఆట
కోడి పందాలే కాదు గుండాట వల్ల కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. కొంచెం డబ్బు వస్తే చాలు మరికొంత కావాలని ఆశతో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవాలని ఆడతారు. పోయిన మనీ కోసం ఆడుతుంటే తిరిగి రావు. దీంతో జేబులు ఖాళీ అవుతుంటాయి. కోడి పందాలను కొందరు సీరియస్‌గా తీసుకుని ఆడుతుంటారు. సంక్రాంతి సీజన్‌లో బరుల వద్దే ఉంటారు. కోడిని బట్టి పందాలు జరుగుతుంటాయి. ఒక్కొక్కరు వేల రూపాయలను కోల్పోతారు. ఖాళీ చేతులతో ఇంటికి వస్తారు. తమ డబ్బులు పోవడంతో విచారంగా ఉంటారు.
అనుమతి లేదు.. కానీ..!
కోడి పందాల నిర్వహణకు అనుమతి లేదు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కోడి పందాలను నిషేధించాలని స్పష్టంచేశాయి. సంక్రాంతి సమయంలో కోడి పందాల అనేవి తమ జీవితంలో భాగమని కొందరు తమ వాదనను వినిపించారు. కోడి పందాలకు సెంటి మెంట్ ఉన్నాయని వివరించారు. దీంతో పందాల నిర్వహణకు అడ్డు తొలగింది.
జేబుకు చిల్లు
సంక్రాంతి సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేస్తారు. భారీగా టెంట్లను వేస్తారు. సౌండ్ బాక్సుల్లో పాటలు పెట్టడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారుతుంది. కొందరి జేబుకు మాత్రం చిల్లు పెడుతుంది. కోడి పందాలు ఆడొద్దని పెద్దలు చెబుతున్న వినిపించుకోరు. తీరా డబ్బులు పోవడంతో నిరాశతో ఇంటికి వస్తుంటారు.
ఎక్కువ డబ్బు వస్తుందని..
పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లిన వారు అక్కడ సరదాగా గడుపుతుంటారు. కోడి పందాలు వేయడంతో ఉన్న కాస్త డబ్బులను కోల్పోతారు. రూపాయి రూపాయి జమ చేసి చివరకు పందాల్లో పొగొట్టుకుంటారు. ఆ కాస్త డబ్బులను పిల్లల భవిష్యత్ కోసమో వాడి ఉంటే బాగుండేదని అనుకుంటారు. ఇన్‌స్టంట్‌గా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ పడటంతో మొదటికే మోసం వస్తుంది. చేతిలో ఉన్న డబ్బులు పందాల రూపంలో కోల్పతారు. అందుకోసమే సరదా సంక్రాంతి కోసం ఊరు వెళ్లిన వారు జాగ్రత్తగా ఖర్చు చేయాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 15 , 2024 | 01:26 PM