BJP State President Purandeswari : విచారణ తర్వాతే చర్యలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:54 AM
అల్లు అర్జున్ విషయంలో పూర్తిస్థాయి పోలీసు విచారణ తర్వాతే ఏవైనా చర్యలు ఉంటాయని అనుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
పోలీసు బందోబస్తుపై అనుమానాలు
అల్లు అర్జున్ వివాదంపై పురందేశ్వరి వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అల్లు అర్జున్ విషయంలో పూర్తిస్థాయి పోలీసు విచారణ తర్వాతే ఏవైనా చర్యలు ఉంటాయని అనుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ‘పెద్ద పేరున్న నటుడిగా సంధ్యా థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చే సమయంలో పోలీసులు తప్పనిసరిగా గట్టి భద్రత ఏర్పాటుచేసి ఉండాలి. అయితే ఆ స్థాయిలో బందోబస్తు లోపించిదేమోనని ప్రజల్లో అనుమానాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ.. ’భారత రాజ్యాంగానికి 106 పర్యాయాలు సవరణలు చేస్తే అందులో చాలా వరకూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. ఇది పూర్తిగా నిరాధారం. అంబేడ్కర్ రాజ్యాంగం కారణంగానే తాను ప్రఽధాని అయ్యానని మోదీ చెప్పారనేది గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ స్వలాభం కోసం రాజ్యాంగ సవరణలు చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదం. జేపీసీ నివేదిక తర్వాత బిల్లుపై చర్చించి ఆమోదించడానికి కసరత్తు జరుగుతుందని’ అని పురందేశ్వరి అన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 04:55 AM