చంద్రబాబు ప్రమాణోత్సవవేళ పురాణపండ కలం నుండి బొల్లినేని సమర్పిస్తున్న రెండు కాంతిపుంజాలు
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:43 PM
ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
విజయవాడ, జూన్ 11: ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
సర్వ దిశలలో, సర్వదశలలో రక్షించే అమ్మవారి ముఖ చిత్రంతో ఉన్న సుమారు మూడువందల పేజీల ‘జయ జయోస్తు’ గ్రంధం ఒకటి కాగా, రెండవ గ్రంధం పేరు.. ‘నారసింహో ... ఉగ్రసింహో’!. అతి అరుదైన వర్ణచిత్రాలతో, వేద వేదాంగాల్లోని సర్వశ్రేష్ఠ సాధనాల్లాంటి మంత్ర వైభవాలతో, పరమాద్భుతమైన వ్యాఖ్యాన వైఖరులతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ రెండు రమణీయ గ్రంధాలకు రచనా సంకలనకర్తగా వ్యవహరించడం ప్రత్యేకత సంతరించుకుంది.
ప్రతీ అక్షరంలోనూ శుభదృష్టి నిండి ఉన్న ఈ అమృతమయ గ్రంధాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, సీనియర్ నేతలకు, అమరావతి హైకోర్ట్ ప్రముఖులకు ఉచితంగా అందించేందుకు ఈ రెండు కాంతి పుంజాలను శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌చే సర్వోన్నతమైన పవిత్ర విలువలతో రూపొందింప చేసినట్లు బొల్లినేని కృష్ణయ్య చెప్పారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పదిరోజుల్లో యావత్తు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యోగులకు ఈ రెండు మంగళ గ్రంధాల ప్రకాశాన్ని ఉచితంగా అందజేయనున్నట్లు సమాచారం. మనస్సులను శాంత తేజస్సుతో వెలిగించేలా పురాణపండ శ్రీనివాస్ ఈ అద్భుతాలను అందించారని తెలుగుదేశం సీనియర్ నేతలు అప్పుడే వ్యాఖ్యానించడం గమనార్హం.
చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతుల సమర్థతతో ఆంధ్రప్రదేశ్ సౌఖ్యప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో బొల్లినేని కృష్ణయ్య ఈ అక్షర సౌభాగ్యాలను పంచిపెట్టడం సంతోషకరంగా ఉందని తెలుగు మహిళా శ్రేణులు సైతం జేజేలు పలుకుతున్నారు.
విభజన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన కమనీయతల రమణీయతల పవిత్రతల అమోఘ ‘మహామంత్రస్య’ అఖండ గ్రంధాన్ని ఆవిష్కరించి ప్రశంసలు వర్షించిన ఉదాత్తమైన అంశం మేధోసమాజానికి ఎరుకే!
Updated Date - Jun 12 , 2024 | 12:04 AM