ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bonda Uma: ఆయన దయతోనే రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం

ABN, Publish Date - May 27 , 2024 | 11:50 AM

రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

అమరావతి: రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.

Rave Party: ఇవాళ నటి హేమ సహా 8 మందిని విచారించనున్న సీసీబీ


‘‘ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ప్రధాన ఎన్నికల అధికారి స్పందన సరిగా లేదు కాబట్టి.. సీఎస్ అక్రమాలపై దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూ దోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా.. జవహర్ రెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. డీ ఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా, సంబంధిత అధికారులందరిపైనా విచారణ జరగాలి. ఆధారాలతో ఆరోపణలు చేస్తే.. విచారణ కోరకుండా, ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రోజు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని బోండా ఉమ తెలిపారు.

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 27 , 2024 | 11:50 AM

Advertising
Advertising