AP NEWS; మంత్రి బొత్స పోటీ చేసేది అక్కడి నుంచే.. ఏమన్నారంటే..?
ABN, Publish Date - Mar 11 , 2024 | 07:16 PM
వైసీపీ (YSRCP) చేపట్టిన ‘సిద్ధం’ సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. సోమవారం నాడు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ‘సిద్ధం’ సభలో జనాలు తక్కువగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫిక్స్‌ను ఎలా మార్ప్ చేశారో అలాగే అందరూ చేస్తారనుకోవడం తప్పని అన్నారు.
విశాఖపట్నం: వైసీపీ (YSRCP) చేపట్టిన ‘సిద్ధం’ సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. సోమవారం నాడు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ‘సిద్ధం’ సభలో జనాలు తక్కువగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫిక్స్‌ను ఎలా మార్ప్ చేశారో అలాగే అందరూ చేస్తారనుకోవడం తప్పని అన్నారు. నిన్న జరిగిన ‘సిద్ధం సభకు సంబంధించిన గ్రాఫిక్ వీడియోని చూపించారు. తాను చీపురుపల్లి నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
గతంలో ఇదే బీజేపీని వ్యతిరేకించాలని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీతో ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. మూడు పార్టీలు కాదు 30 పార్టీలు కలిసిన, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా తమ మేనిఫెస్టోను ప్రకటించి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో175 కి 175 సీట్లు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఏపీకి వచ్చి మాట్లాడిన ఏం ప్రయోజనం లేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర నేతలను నిలదీయాలని అన్నారు. ఏ పార్టీతో తమకు పొత్తు లేదని ప్రజలతోనే తమ పొత్తు అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 11 , 2024 | 11:37 PM