ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Botsa Satyanarayana: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది

ABN, Publish Date - Dec 02 , 2024 | 03:02 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్‌లో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం, డిసెంబర్ 02: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తీరు చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుందని వ్యంగ్యంగా అన్నారు. గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1, 2 చిత్రాల్లో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ.. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్నించారు.


మంత్రి ప్రమేయం లేకుండానే..?

మంత్రి ప్రమేయం లేకుండా ఈ కార్యక్రమాలు జరుగుతాయా? అని పవన్ కల్యాణ్‌ను బొత్స నిలదీశారు. పోర్టు.. రెడ్డి గారికి ఉంటే ఏమిటి? చౌదరి గారికి ఉంటే మాకు ఏం సంబంధమన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని స్పష్టం చేశారు.


అప్పట్లో భ్రమ పడ్డా..

2004లో తాను మంత్రి అయినప్పుడు తనకు ఎన్నో అధికారాలున్నాయని భ్రమ పడ్డానని తెలిపారు. మొదట్లో మంత్రి పదవి వచ్చినప్పుడు హూ.. ఆ.. అంటామని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా బొత్స విమర్శించారు. కానీ వారు.. వీరు కూర్చొని మాట్లాడుకొని... కష్టసుఖాలు తెలుసుకున్న అనంతరం అన్ని మర్చిపోతారని చెప్పారు.


పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై బొత్స ఫైర్

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఒక రాజకీయ పార్టీ నాయకురాలు లాగా మాట్లాడడం లేదన్నారు. ఆమెను మీరు గుర్తిస్తున్నారేమో కానీ.. తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు. తాను సైతం గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని ఈ సందర్బంగా బొత్స గుర్తు చేసుకున్నారు. పీసీసీ చీఫ్‌గా పలు అంశాలపై మాట్లాడాలి కానీ.. వ్యక్తిగతంగా మాట్లాడకూడదంటూ వైఎస్ షర్మిల వ్యవహార శైలిని ఆయన నిశీతంగా విమర్శించారు. పంచాయతీల కోసం రాజకీయాలు లేవనే విషయాన్ని వైఎస్ షర్మిల గ్రహించాలన్నారు.


బెల్ట్ షాపులు.. విద్యుత్ ఛార్జీలు

కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బడ్జెట్‌లో.. కనబడడం లేదన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన అనంతరం ట్రూప్ ఛార్జీల పేరుతో పెంచడానికి రెడీ అవుతున్నారని విమర్శించారు. ఈ ట్రూప్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఊళ్లో బెల్ట్ షాపునకు ఆక్షన్ వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోచ్చునని ..ఈ విషయం అన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వివరించారు.


సూపర్ సిక్స్ అమలు ఎక్కడ..?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు ఎక్కడ అమలవుతున్నాయని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు ఏమి అవుతున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంకు టీసీఎస్ కంపెనీ రావడం మంచిదే.. మరి మిగిలిన కంపెనీలు ఎప్పుడు వస్తాయి, ఎన్ని ఉద్యోగులొస్తాయి అనే విషయాన్ని సైతం ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ నిలదీశారు.

For AndhraPradesh News And Telugu news

Updated Date - Dec 02 , 2024 | 03:53 PM