Buddha Venkanna: కే అంటే కోవర్టు.. కేశినేని నాని బాలయోగి ఆస్తులు కాజేశాడు: బుద్దా వెంకన్న
ABN, Publish Date - Jan 21 , 2024 | 12:36 PM
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కే అంటే కేశినేని నాని కాదు.. కోవర్టు అని ధ్వజమెత్తారు. మాజీ లోక్ సభ స్పీకర్, దళిత నేత జీఎంసీ బాలయోగి ఆస్తులను కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు.
విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ( Kesineni Nani) టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కే అంటే కేశినేని నాని కాదు.. కోవర్టు అని ధ్వజమెత్తారు. మాజీ లోక్ సభ స్పీకర్, దళిత నేత జీఎంసీ బాలయోగి ఆస్తులను కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు అని పేర్కొన్నారు. బాలయోగి ఆస్తులు ఇచ్చి, అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిలింగ్‌క్ మారు పేరు కేశినేని నాని అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కేశినేని నాని చెప్పగలడా అని ప్రశ్నించారు. నిన్న, మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడిగా కేశినేని నాని ఉన్నారని తెలిపారు. ఇప్పుడు దేవినేని అవినాష్ ఫాలొవర్ అయి, తన స్థాయిని తగ్గించుకున్నాడని బుద్దా వెంకన్న విమర్శించారు.
కాల్ మనీ అంటే ఏంటీ నాని..?
కేశినేని నాని జీవితంలో చేయని తప్పులు లేవని బుద్దా వెంకన్న మండిపడ్డారు. దొంగ రసీదు పుస్తకాలు తయారు చేసి, ఫైనాన్స్ కంపెనీకి రూ.కోట్ల ఎగ్గొట్టాడని గుర్తుచేశారు. రూ.100 బస్ టికెట్ రూ.500 విక్రయించి సొమ్ము చేసుకున్నాడని విరుచుకుపడ్డారు. ఒకే నంబర్ ప్లేట్ మీద బస్సులు తిప్పాడని వివరించారు. విజయవాడలో భూకబ్బాలకు పేటెంట్ ఉన్న ఒకే వ్యక్తి కేశినేని నాని అని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ అంటే ఏంటో చెప్పగలవా అని సవాల్ విసిరారు.
జగన్ కొట్టి పంపేవాడు...!
కోవర్టు నానిని ఎంపీ చేయడం చంద్రబాబు చేసిన తప్పు అని బుద్దా వెంకన్న అభిప్రాయ పడ్డారు. నారా లోకేశ్‌ను విమర్శించే స్థాయి నానిది కాదని ఫైరయ్యారు. నాని తెలుగుదేశం పార్టీ వీడే సమయంలో పట్టుమని పది మంది ఆయన వెంట లేరని పేర్కొన్నారు. నానిని చంద్రబాబు మంచితనంతో వదిలేశాడని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. అదే సీఎం వైఎస్ జగన్ అయితే కొట్టి పంపించేవాడని పేర్కొన్నారు. 2019లో నాని రూ.9 కోట్ల చందాలు వసూల్ చేశాడని ఆరోపించారు. కేశినేని నాని కొవ్వు కరిగిస్తాం అని స్పష్టంచేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 21 , 2024 | 12:36 PM