ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: వారు విచారణకు సహకరించడంలేదు.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:49 AM

వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

అమరావతి: వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణకు సహకరించకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై జస్టిస్ సుధాంశు దులియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.


విచారణకు సహకరించాలంటూ సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిందితులు విచారణకు సహకరించకపోవడం గమనార్హం. వారు విచారణాధికారులకు సహకరించడంలేదంటూ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, పాస్ పోర్టులను కూడా అప్పగించేశామని అవినాశ్, జోగి రమేశ్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది.


లొంగిపోయిన ప్రధాన నిందితుడు..

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య అక్టోబర్ 14న మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఇతడు ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు. 2021 అక్టోబరు 19న మంగళగిరి బైపాస్‌ రోడ్డులోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మూక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సీసీ ఫుటేజీల్లో ఆధారాలు లభ్యమయ్యాయి.


2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన చైతన్య.. ముందస్తు వ్యూహం ప్రకారమే మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. చైతన్యకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం సోమవారం మంగళగిరి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు.

Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి

For Latest News and National News click here

Updated Date - Oct 21 , 2024 | 11:50 AM