AP Election 2024: పోలింగ్ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని వివరించాలి: సీఈఓ మీనా
ABN, Publish Date - Apr 07 , 2024 | 10:56 PM
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలల్లో(AP Election 2024) సామాజిక మాధ్యమాల ద్వారా యువత, పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్నారు. దీనికోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఈఓ తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి 'టర్నింగ్ 18' ప్రచారం ద్వారా యువ, మొదటిసారి ఓటర్లకు ప్రోత్సాహానిస్తున్నట్లు తెలిపారు.
అమరావతి: 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలల్లో (AP Election 2024) సామాజిక మాధ్యమాల ద్వారా యువత, పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అన్నారు. దీనికోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఈఓ తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి 'టర్నింగ్ 18' ప్రచారం ద్వారా యువ, మొదటిసారి ఓటర్లకు ప్రోత్సాహానిస్తున్నట్లు తెలిపారు.
AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!
పోలింగ్ వ్యవస్థతో సహా ఎన్నికల ప్రక్రియలోని ప్రాముఖ్యతను గుర్తించి ఏ ఒక్క ఓటరూ కూడా వెనకబడకూడదని ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే 'యు ఆర్ ది వన్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. యువత లక్ష్యంగా 'జెనరేషన్ జీ' విధానంలో ఆకర్షణీయమైన కంటెంట్ తయారీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ప్రత్యేక ప్రచారాన్ని సేకరిస్తున్నట్లు సీఈఓ మీనా తెలిపారు.
TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 07 , 2024 | 11:04 PM