ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ap CM Chandrababu : విభజన కంటే జగన్‌తోనే ఎక్కువ నష్టం

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:28 AM

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు దొంగబుద్ధితో వ్యవహరించి, దొంగ పనులు చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019 నుంచి జగన్‌ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అభిప్రాయపడ్డారు.

  • జనం నెత్తిన చెయ్యిపెట్టి ఆస్తులు రాయించుకున్నారు

  • అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారు

  • ఐదేళ్లలో వైసీపీ లక్షల కోట్ల అప్పులు

  • ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చే పరిస్థితి లేదు

  • త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఏర్పాటు

  • రాజధానిలో అమరజీవికి నిలువెత్తు విగ్రహం

  • మ్యూజియంగా శ్రీరాములు స్వగృహం

  • ఆయన స్వగ్రామం పడమటిపల్లె అభివృద్ధి

  • పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు

  • జగమంతా తన కుటుంబమే అనుకున్న అమరజీవి

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నివాళి

కొంతమంది నేతలు స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ లక్షల కోట్ల అప్పులు చేసింది. దీంతో ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి లేదు. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి మరో రెండేళ్లు ఉంది. ఈ సంఘం ఇచ్చే ఐదేళ్ల నిధులను వైసీపీ ప్రభుత్వం ముందే డ్రా చేసేసింది.

- సీఎం చంద్రబాబు

విజయవాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు దొంగబుద్ధితో వ్యవహరించి, దొంగ పనులు చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019 నుంచి జగన్‌ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అభిప్రాయపడ్డారు. జనం నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులు రాయించుకున్నారని విమర్శించారు. జాతి, సమాజం కోసం త్యాగాలు చేసిన వారితో పాటు నెత్తిపై చెయ్యి పెట్టే వాళ్లను, 2019-24 మధ్య పాలనను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పేరుతో నిర్వహించిన ఆయన వర్ధంతి కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా పొట్టి శ్రీరాములు, సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, రాజధాని అమరావతిలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


తెలుగు జాతి కోసం అమరజీవి చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా అప్పటి సీఎం ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లో ఆయన పేరుతో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తర్వాత తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన జన్మించిన నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశానని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో తెలుగు వర్సిటీ మార్చే పేరు పరిస్థితి వచ్చిందన్నారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జమంతిని ఘనంగా నిర్వహిస్తామని, ఆయన పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇంటిని మ్యూజియంగా మారుస్తామని ప్రకటించారు. కొద్దిమంది మాత్రమే జాతి కోసం ఆలోచిస్తారని, ఆయన మాత్రం తెలుగు జాతి కోసం ఆలోచించారన్నారు. దేశంలో రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన త్యాగమే కారణమన్నారు.ఆ త్యాగం లేకుండా రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన స్ఫూర్తిని ప్రజల్లో నింపాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని, అది లేకపోతే జాతికి మనుగడ ఉండదని వాదించారని చెప్పారు. పొట్టి శ్రీరాములు స్వాతంత్య్రం, హరిజనుల హక్కుల కోసం పోరాడిన సామాజిక, మానవతావాది అని చెప్పారు. ఆయన జన్మించిన పడమటిపల్లెను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని విమర్శించారు. జాతి ప్రయోజనాల కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన నేతల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పాలన పరంగా కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ స్ఫూర్తి తమను ముందుకు నడిపిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వారి స్ఫూర్తితోనే విజన్‌ 2047 డాక్యుమెంట్‌ను రూపొందించామని తెలిపారు. ఇది ఒక వ్యక్తి, కులం, మతం, కుటుం బం కోసం కాదని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఏం చేస్తామో చెప్పే హామీ అని పేర్కొన్నారు.


  • రాష్ట్రాన్ని నాశనం చేశారు

కొంతమంది నేతలు స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని, మూడు రాజధానుల పేరుతో అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ రూ. లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి అప్పు ఇచ్చేవారు లేరని, అప్పు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి మరో రెండేళ్లు ఉందని, ఈ సంఘం ఇచ్చే ఐదేళ్ల నిధులను వైసీపీ ప్రభుత్వం డ్రా చేసేసిందని చెప్పారు. ఓపిక, అనుభవం ఉన్నా ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి ఆక్సిజన్‌ ఇస్తున్నారన్నారు. రాజకీయ నేతల్లో ఐటీ కోసం మాట్లాడేది తానేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ దీని గురించి మాట్లాడతానని చెప్పారు. రైతులకు ధాన్యం డబ్బులను 48 గంటల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని సూచిస్తే, సాయంత్రానికి జమ చేస్తున్నామని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. ఆ సమయం కూడా తీసుకోకుండా రైతు మిల్లులో ధాన్యం ఇచ్చినట్టు నమోదు కాగానే వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావాలని, ఇదంతా ఐటీ ద్వారా సాధ్యమని అన్నారు. త్వరలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రజలు న్యాయమైన సమస్యలను అందులో పోస్ట్‌ చేస్తే వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేతలు, అధికారుల చుట్టూ ప్రజలు తిరగడం కాకుండా వాళ్లే ప్రజలకు వద్దకు వెళ్తారని, ఆ విధమైన పాలనను త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.


  • ‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ’ పుస్తకం ఆవిష్కరణ

భాష, సాంస్కృతిక సంచాలకుడు మల్లికార్జునరావు రాసిన ‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ’ పుస్తకాన్ని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. అమరావతి బౌద్ధస్థూపాన్ని మల్లికార్జునరావు చెక్కారని, ఆ ప్రాజెక్టును ఆయనే పూర్తి చేశారని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమం అనంతరం పొట్టి శ్రీరాములు మేనల్లుడు వెంకటేశ్వర్లు, కుమారులు గుణిపూడి సుబ్రహ్మణ్యం, నరసింహరావు, హనుమంతరావును సీఎం, డిప్యూటీ సీఎం శాలువాలు కప్పి సత్కరించారు. ప్రకాశం జిల్లా మారెళ్ల గ్రామంలో పొట్టి శ్రీరాములు స్వయంగా నిర్మించిన ఆసుపత్రి ఉందని, అక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని హనుమంతరావు విన్నవించగా సీఎం సానుకూలంగా స్పందించారు.

  • అమరజీవి ఆశయాలను కొనసాగించాలి

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

జగమంతా తన కుటుంబమని పొట్టి శ్రీరాములు భావించారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగించడానికి అంతా కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మనుషులకు మరుపు చాలా సహజమని అయితే మనకు ఎవరి వల్ల ఉపయోగం కలిగిందో వారిని మర్చిపోకూడదని చెప్పారు. పొట్టి శ్రీరాములు 50రోజులకు పైగా అన్నపానీయాలు లేకుండా, పేగులు మండుతున్నా, బంకమట్టిని తడిపి వస్త్రంలో పెట్టి పొట్టకు చుట్టుకునేవారని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ఆద్యుడని, ఆయనపై సమాచార శాఖ రూపొందించిన ఏవీ మనసును కదిలించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణ చేసిన వ్యక్తి పాడె మోయడానికి ఎవరూ రాకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనమంతా ఆంధ్రులమని చెప్పుకుంటున్నామంటే దానికి కారణం పొట్టి శ్రీరాములు అన్నారు. రాష్ట్ర ప్రజలకు గుర్తుండేలా ఆయన వర్థంతి చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు రూపొందించిన విజన్‌-2047ను కులం, మతం, ప్రాంతం లేకుండా అందరూ అందిపుచ్చుకోవాలని పవన్‌ కోరారు.

Updated Date - Dec 16 , 2024 | 04:32 AM