మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...

ABN, Publish Date - Apr 20 , 2024 | 11:00 AM

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.

Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...
Nara Bhuvaneswari

అమరావతి: ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రవి నాయుడు ఏర్పాటు చేసిన కేక్‌ను సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీమ్ సభ్యులకు పంచారు.చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీమ్, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AP Elections: తూర్పున యుద్ధమే.. ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?


కాగా.. కుప్పంలో రెండవ రోజు నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నేటి ఉదయం సామగుట్టపల్లి కదిరి నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నా కాంటీన్‌లో చంద్రబాబు తరుపున పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకూ పార్టీ కార్యాలయం వద్దనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహిళలు, మైనారిటీ, మాజీ ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అవాలంభించాల్సిన విషయాలపై నారా భువనేశ్వరి దిశానిర్దేశం చేస్తారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారు?

AP Elections: తూర్పున యుద్ధమే.. ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 11:00 AM

Advertising
Advertising