ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CBN: వైసీపీని భూస్థాపితం చేయాలి.. పిలుపునిచ్చిన చంద్రబాబు

ABN, Publish Date - Apr 14 , 2024 | 05:51 PM

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని(YSRCP) భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రజలకు పిలుపునిచ్చారు.

అమరావతి: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని(YSRCP) భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రజలకు పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. "ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను జగన్ రద్దు చేశారు. అంబేడ్కర్‌కు భారత రత్న రావడానికి మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.

అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలి. ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పది. అంబేడ్కర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కాడు. జగన్ వస్తే గంజాయి వస్తుంది. అంటరానితనాన్ని టీడీపీ నిషేధించింది. రూ.500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకుని.. ప్రజలకు మాత్రం చిన్న ఇల్లు కట్టించలేకపోయాడు.


AP Election 2024: జగన్‌పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయదు. వారికిచ్చిన 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఉత్తరాంధ్రలో కొండల్ని జగన్ అనకొండలా మింగేశాడు. 3 సార్లు జగన్ బస్సు ఛార్జీలు పెంచారు. కుంభ కోణాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలి. విశాఖను ఐటీ కేంద్రంగా చేయాలని భావించాను. కానీ గంజాయి కేంద్రంగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీలకు న్యాయం చేశాం. రానున్న ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు" అని బాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 06:01 PM

Advertising
Advertising