AP Politics: జగన్ రెడ్డి అర్జునుడు, అభిమన్యుడు కాదు.. భస్మాసురుడు: చంద్రబాబు నిప్పులు
ABN, Publish Date - Jan 28 , 2024 | 01:57 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారు. నిజానికి జగన్.. అర్జునుడో, అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారు. నిజానికి జగన్.. అర్జునుడో, అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్‌లో జరిగిన ‘రా కదలిరా’ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబు కామెంట్స్
‘జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్ట పోయింది. అయిదేళ్లు బాధితులం ఉన్నాం. బెదిరించి, భయపెట్టి తరిమేసే పరిస్థితికి వచ్చారు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్‌గా చేయడమే నా లక్ష్యం. తుగ్లక్ ఆలోచనలు. సైకో పాలనతో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారు. సిద్దం మీటింగ్ పెట్టారు. నువ్వు సిద్దమంటే, నువ్వు టిక్కెట్లు ఇచ్చిన వారు పారిపోతున్నారు. వైసీపీ వారికి రా... కదలిరా... అని పిలుపునిస్తున్నా. తమ పార్టీలో చేరాలని కోరారు. రాష్ట్రంలో ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా? రైతు చితుకుపోయాడు. ధాన్యం కొనుగోళ్లలో కమీషన్లు తీసుకుంటున్నారు. అప్పులు ఎక్కువ ఉండే రైతాంగం, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండే రాష్ట్రంగా ఏపీ తయారైంది. ఇప్పుడు కూడా అబద్దాలే చెబుతున్నాడు. అబద్దాల్లో సీఎం జగన్‌కి డాక్టరేట్ ఇవ్వాలి. 72 రోజుల్లో ఓటు నీ నెత్తిన పెట్టి భస్మాసరం చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. పేదవారి పొట్ట కొట్టి, పేదల ప్రతినిధి అని చెప్పుకుంటావా? తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలకి నిధులిచ్చి పాత పద్దతి తీసుకువస్తాం. టీడీపీ హయాంలో రూ.60 క్వార్టర్ ఉంటే ఈ రోజు అది రూ.200 అయ్యింది. రూ.56 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు పెంచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ఒక్క రూపాయ ఇచ్చాడా? జగన్ బిడ్డ కాదు... క్యాన్సర్ గడ్డ... తొలగించాలా? వద్దా? నీ ఫ్యానుకి ఉండే మూడు రెక్కలని ప్రజలు పీకి పాతరేస్తారు. రివర్స్ పాలనలో రివర్స్ గిఫ్టు ఇస్తారు. జగన్మోహన్ రెడ్ది నువ్వు చేసినవి తప్పులు అని చెబితే ఆనం, కోటంరెడ్డిలను బయటకు పంపాడు. ఒక్కసారి అని అవకాశం ఇస్తే ఎవరైన బాగుపడ్డారా.. గల్లా జయదేవ్‌ను వేధించడంతో రాజకీయాలే వద్దు అంటున్నారు. జగన్మోహన్ రెడ్ది జన్మించక ముందునుంచే రాజకీయాలు చేస్తున్నాను. కావాలంటే కలలో మీ నాన్న రాజశేఖర్ రెడ్డిని అడుగు జగన్ అని’ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 28 , 2024 | 02:12 PM