ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu: మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్‌

ABN, Publish Date - Mar 17 , 2024 | 06:59 PM

టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం (Praja Galam) సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) నిప్పులు చెరిగారు. మూడు ముక్కలాటతో అమరావతిని, రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని, సహజ వనరులను దోచేసిందని ఆరోపించారు.

టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం (Praja Galam) సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) నిప్పులు చెరిగారు. మూడు ముక్కలాటతో అమరావతిని, రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని, సహజ వనరులను దోచేసిందని ఆరోపించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ పేరుతో జగన్ దోచేశారని మండిపడ్డారు. గంజాయి, అశాంతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. జగన్ రక్తదాహానికి చిన్నాన్న చనిపోయాడని ఆరోపించారు. ఇద్దరు చెల్లెళ్లు రోడ్డెక్కి మరీ జగన్‌కు ఓటు వేయొద్దని చెప్తున్నారంటే.. ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయన్నారు.

జగన్ సర్కార్ పెట్టుబడులను తరిమేసిందని పేర్కొన్న చంద్రబాబు.. ఐదేళ్లలో రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అసలు అభివృద్ధే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ చాలా ఇబ్బందుల్లో ఉందని.. కలెక్టరేట్ ఆఫీసు, రైతు బజార్ బిల్డింగ్ లాంటివి కూడా తనఖా పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్‌ చీకటిమయం చేశారని.. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేశారు. మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రజలు గెలవాలని, మన బిడ్డలు వెలగాలని, అందుకే ఈ పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. దేశంలో ఎన్డీయేకు (NDA) 400+ సీట్లు వస్తాయన్న ఆయన.. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదేనని ప్రజల్ని కోరారు. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలని చెప్పుకొచ్చారు.


అంతకుముందు.. ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విచ్చేసినందుకు ఐదుకోట్ల ప్రజల తరఫున మోదీకి ఆయన స్వాగతం పలికారు. మోదీ ఒక వ్యక్తి కాదని.. భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చుతున్న ఓ శక్తి అని కొనియాడారు. మోడీ అంటే సంక్షేమం, అభివృద్ది, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమని అన్నారు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాలతో ప్రధాని మోదీ సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. తాము నిర్వహించిన ప్రజాగళం సభ రాష్ట్ర పునర్‌నిర్మాణ సభ అని.. ఇది ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ అని అన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటివి చేస్తున్నారని.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారని చెప్పారు.

నోట్ల రద్దు వంటి సంస్కరణలతో ప్రధాని మోదీ భారత్ ముఖచిత్రాన్ని మార్చారని చంద్రబాబు ప్రశంసించారు. పేదరికం లేకుండా చేయడమే మోదీ కల అని.. ఇందుకు మనమంతా ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలని అన్నారు. వికసిత్‌ భారత్‌కు ఇదే సరైన సమయమని.. అందుకు అందరూ అండగా ఉండాలని కోరారు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించేందుకే తమ మూడు పార్టీలు జట్టు కట్టాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరిచ్చే తీర్పే.. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని ప్రజల్ని ఉద్దేశించి చెప్పారు. తమ జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని నొక్కి చెప్పారు. సంక్షేమం అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ తమ లక్ష్యమని వివరణ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 07:43 PM

Advertising
Advertising