ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: పథకాలకు నిధుల విడుదలపై చంద్రబాబు లేఖ.. వెంటనే స్పందించిన గవర్నర్..

ABN, Publish Date - May 16 , 2024 | 10:45 AM

డీబీటీ పథకాలకు నిధుల విడుదల తక్షణం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు. సంక్షేమ పథకాల కోసం కేటాయించిన సొమ్మును కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు వాడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లేఖపై గవర్నర్ వెంటనే స్పందించారు. చంద్రబాబు ఫిర్యాదుతో ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు.

Chandrababu

అమరావతి: డీబీటీ పథకాలకు నిధుల విడుదల తక్షణం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) గవర్నర్‌కు లేఖ రాశారు. సంక్షేమ పథకాల కోసం కేటాయించిన సొమ్మును కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు వాడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లేఖపై గవర్నర్ వెంటనే స్పందించారు. చంద్రబాబు ఫిర్యాదుతో ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు. ఆర్థిక శాఖ అధికారులకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు డీబీటీ పథకాలకు నిధులు విడుదలకు రంగం సిద్ధమైంది. మొత్తం రూ.14 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా అరాకొరగా నిధులు విడుదల చేసి జగన్ సర్కార్ చేతులు దులుపుకుంది.

TDP: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!


మొత్తం భారాన్ని రానున్న ప్రభుత్వంపైకి నెట్టివేసే ఎత్తుగడ వేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. నిన్న ఆసరాకు రూ.1480కోట్లు.. జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌కు రూ.502 కోట్లు విడుదల.. వెరసి మొత్తంగా 2000 కోట్లు కూడా జగన్ సర్కార్ విడుదల చేయకపోవడం గమనార్హం. సాధారణ ఎన్నికలకు ముందు 14 వేల కోట్లు జమ చేస్తామని న్యాయస్థానం గడప తొక్కిన సర్కార్.. తద్వారా ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నానికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసింది. హైకోర్టులో సంక్షేమ పథకాలకు జనవరి నుంచి చెల్లించాల్సిన సొమ్ము మొత్తం సిద్ధంగా ఉందని వెంటనే చెల్లించేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. పోలింగ్ తర్వాత నుంచి సొమ్ము చెల్లించాలని కోర్టు తెలిపింది. అయినా మొత్తం సొమ్ము చెల్లించకుండా కేవలం అరకొర నిధులు చెల్లించి మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రయత్నాన్ని జగన్ సర్కార్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి...

AP News: రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. డివైడర్‌, ట్రావెల్స్ బస్‌లను ఢీకొట్టి.. ఆపై..

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 10:45 AM

Advertising
Advertising