Chinarajappa: బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయం
ABN , Publish Date - Feb 06 , 2024 | 09:34 PM
బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. పొత్తులు కుదిరితే కొందరు త్యాగాలు చేయక తప్పదన్నారు.
అమరావతి: బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. పొత్తులు కుదిరితే కొందరు త్యాగాలు చేయక తప్పదన్నారు. పొత్తుల వ్యవహారాన్ని కొంతమంది వైసీపీ నాయకులు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. నిన్న వైసీపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికే అనేక సార్లు జనసేన - మధ్య వైసీపీ నాయకులు చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని చినరాజప్ప అన్నారు.