ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chirala : ఆడపిల్లలే శాపమా!?

ABN, Publish Date - Jul 08 , 2024 | 04:03 AM

భార్యాభర్తలను విధి వేరు చేసింది. నెలక్రితం ప్రమాదవశాత్తు రొటావేటర్‌ కిందపడి భర్త మృతి చెందగా, అప్పటికే గర్భిణిగా ఉన్న భార్య వారం క్రితం ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

  • ఆడ పిల్లలు పుట్టారని కోడలిని ఇంట్లోకి రానివ్వని అత్త

  • భర్త చనిపోయిన కొద్దిరోజులకే నడి రోడ్డుపై బాలింత

  • డెలివరీ అయి ఆస్పత్రి నుంచి వస్తే కనీస కనికరం లేదు

  • ముగ్గురు ఆడపిల్లలతో మెట్టినింటి వద్ద బైఠాయించిన బాధితురాలు

చీరాలటౌన్‌, జూలై 7: భార్యాభర్తలను విఽధి వేరు చేసింది. నెలక్రితం ప్రమాదవశాత్తు రొటావేటర్‌ కిందపడి భర్త మృతి చెందగా, అప్పటికే గర్భిణిగా ఉన్న భార్య వారం క్రితం ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడలిని చేరదీసి ధైర్యం చెప్పి కొండంత అండగా ఉండాల్సిన అత్త ఆమెను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది. బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని కొత్తపాలేనికి చెందిన అక్కల మణికంఠ, కుసుమాంజలి భార్యాభర్తలు.

గత నెల 10న తండ్రి సుందరరామిరెడ్డి ట్రాక్టర్‌తో దుక్కిదున్నుతుండగా మణికంఠ ప్రమాదవశాత్తూ రొటావేటర్‌ కింద పడి మృతి చెందాడు. అప్పటికి కుసుమాంజలి నిండు గర్భిణి. పైగా అప్పటికే వారికి ఒక ఆడపిల్ల ఉంది. వారం క్రితం పట్టణంలోని ఓ వైద్యశాలలో ఇద్దరు కవల ఆడ పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లగా అత్త నాంచారమ్మ, మామ సుందరరామిరెడ్డి, చినమామ రాజు ఆమెను అడ్డగించారు.

ముగ్గురు ఆడ పిల్లలతో ఇంట్లో ఉండేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో నిరాశతో నిండు గర్భిణి ఇంటిముందే బైఠాయించింది. కొద్దిసేపటి తరువాత వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. కాగా, కనీస మానవత్వం చూపకుండా కోడలిని గెంటేసిన అత్తామామలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 04:03 AM

Advertising
Advertising
<