ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..

ABN, Publish Date - Aug 14 , 2024 | 07:51 AM

తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరగనుంది. ఇవాళ సాయంత్రం శ్రీవారి ఆలయంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాని నిర్వహించనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

తిరుపతి: తిరుమల (Tirumala) శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు (Annual Celebrations) బుధవారం అంకురార్పణ (Ankurarpana) జరగనుంది. ఇవాళ సాయంత్రం శ్రీవారి ఆలయంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు టీటీడి అధికారులు రద్దు చేశారు.


కాగా భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల అనుమతిపై టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 56వ మలుపు వద్ద ఆదివారం రాత్రి ఓ చిరుతపులి రోడ్డు దాటుతూ ద్విచక్రవాహనదారుల కంటపడిన విషయం తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వన్యప్రాణుల్లో సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్‌రోడ్డులో తరచూ రోడ్డు దాటుతున్నాయని టీటీడీ ఫారెస్ట్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ తెలిపారు. ఈనేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపారు.


తిరుమల ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగష్టు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇదో అగ్లీ దందా!

మళ్లీ చంద్రన్న కానుకలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 14 , 2024 | 08:17 AM

Advertising
Advertising
<