ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP DGP: గంజాయిని త్వరలోనే అరికడతాం...

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:12 PM

Andhrapradesh: నేరాలను అదుపు చేయడం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సవాళ్ళను ప్రతి సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్‌లో వాహనాలు పాతబడ్డాయని.. వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు.

AP DGP Dwaraka Tirumala Rao

తిరుపతి, జూలై 13: నేరాలను అదుపు చేయడం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు (AP DGP Dwaraka Tirumala Rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సవాళ్ళను ప్రతి సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్‌లో వాహనాలు పాతబడ్డాయని.. వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు. కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్ ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పౌరులకు మెరుగైన సేవలందించి, పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. చట్టాన్ని గౌరవించాలని తెలిపారు.

Congress: బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..!?


గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. పోలీసులు పనితీరును పెంపోందించుకుని మెరుగు పరుచుకోవాలని సూచించారు. అమాయక గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్నారని మండిపడ్డారు. దానిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే అరికడతామని స్పష్టం చేశారు. యాంటీ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అరికడతామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం గంజాయిపై ఎక్కువ ఫోకస్ పెట్టామని తెలిపారు. ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పించామన్నారు. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతామని డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

CM Chandrababu: అధికారంలోకి వచ్చాం కదా అని అలసత్వం వద్దు..

Assembly bypolls: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 03:23 PM

Advertising
Advertising
<