Share News

Elections 2024: సుప్రీం కోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:06 AM

న్యూఢిల్లీ: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Elections 2024: సుప్రీం కోర్టును  ఆశ్రయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

న్యూఢిల్లీ: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) తనయుడు (Son) చంద్రగిరి (Chandragiri) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి (YCP MLA Candidate)) చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohit Reddy) సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ (17A), ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ (Scrutiny) చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ (Repolling) జరపాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.


దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ... మోహిత్ రెడ్డి సుప్రీం ధర్మానసంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రీపోలింగ్‌ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్‌ వేయడం సంచలనం కలిగిస్తోంది. మరి సుప్రీం ధర్మాసనం ఏం తీర్పు చెబుతుందో చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..

ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 03 , 2024 | 11:08 AM