ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: మరో అధికారిపై ఈసీ సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2024-02-09T23:05:30+05:30

తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా ఓ అధికారిపై సస్పన్షన్ వేటు వేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అమరావతి: తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా ఓ అధికారిపై సస్పన్షన్ వేటు వేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో గతంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సీఈసీ సూచనల మేరకు ఉత్తర్వులను మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ జారీ చేశారు. ఓటరు కార్డుల డౌన్ లోడ్ స్కాంలో చంద్రమౌళిశ్వర రెడ్డిని బాధ్యుడిగా సీఈసీ గుర్తించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుగా చంద్రమౌళీశ్వర రెడ్డి వ్యవహరించారు.

అయితే ఓటరు కార్డుల డౌన్ లోడ్ స్కాంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా‌ను సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎవరు నియమించకుండానే తనకు తానే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఈఆర్వోగా చంద్రమౌళీశ్వ రెడ్డి వ్యవహరించినట్లు కేంద్ర ఎన్నికల అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మెప్మా అడిషనల్ డైరెక్టరుగా చంద్రమౌళీశ్వర రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. చంద్రమౌళీశ్వర రెడ్డి తీరును సీఈసీ క్రిమినల్ నేరంగా పరిగణించి అతనిపై పూర్తి స్థాయి విచారణకు ఈసీ ఆదేశించింది.

Updated Date - 2024-02-09T23:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising