Elephants: ఓకేసారి 16 ఏనుగుల గుంపు.. హడలెత్తిపోయిన ప్రజలు
ABN, Publish Date - Oct 25 , 2024 | 09:53 AM
Andhrapradesh: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ఒకేసారి 16 ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంటపొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు, అక్టోబర్ 25: జిల్లాలో ఏనుగుల బీభత్సం అంతాఇంతా కాదు. తరచుగా గజరాజులు జిల్లాలో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తుంటాయి. సాధారణంగా గుంపు ఏనుగులు ఆహారంకోసమో, దాహం తీర్చుకోవడానికో అడవుల మధ్య నుంచి జనావాసాలవైపు వస్తూ దాడులు చేస్తాయి. పంటలను నాశనం చేయడంతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే గుంపులో ఉన్నప్పుడు వీటి నుంచి ప్రమాదం కాస్త తక్కువనే చెప్పుకోవచ్చు. డప్పులు వాయిస్తూనో, టపాసులు కాలుస్తూనో భయపెడితే, వెళ్లిపోతాయి. మళ్లీ చాలాకాలం ఇటువైపు తిరిగి చూడవు.
Telangana: పక్కా ఆధారాలు.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి
తాజాగా జిల్లాలోని పులిచెర్ల మండలం పాలెం పంచాయితీ గుట్టమీద పల్లె సమీపంలో 16 ఏనుగుల గుంపు హల్‌చేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారి వచ్చిన ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడికి దిగాయి. మామిడి తోటల్లో ఏనుగుల గుంపు మాటు వేసింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పోలీసులు అక్కడకు చేరుకుని ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెల రోజుల నుంచి కల్లూరు, పులిచెర్ల మండలాల్లో పలు గ్రామాల్లో వరుసగా పంటలపై రెండు మూడు ఏనుగులు దాడి చేస్తున్నాయి. అయితే ఈరోజు ఉదయం ఏకంగా 16 ఏనుగుల గుంపు ప్రత్యక్షం కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
ఒంటరి ఏనుగు యమా డేంజర్
అయితే గుంపు ఏనుగుల కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదకరమైందని చెప్పుకోవచ్చు. గుంపు ఏనుగులను ఏదో రకంగా భయపెట్టిస్తే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ ఒంటరి ఏనుగు వచ్చిందంటే చాలు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి పరిస్థితి ఉంటుంది. గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు చాలా ప్రమాదకరమైనది. ఇది మనుషుల అదిలింపులకు కాస్త బెదిరినా.. మళ్లీ మళ్లీ దాడికి తెగబడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో గ్రామాల శివార్లలోని పొలాల్లో కాపలా ఉండే లేదా ఇతర పనులు చేసుకునే రైతులు మృత్యువాత పడుతుంటారు.
కాగా.. కుప్పం నియోజకవర్గ గ్రామీణులను ఒంటరి ఏనుగు చాలాకాలంగా వణికిస్తోంది. రామకుప్పం మండలం పీఎంకే తాండాలో రెడ్యానాయక్ అనే రైతును ఒంటరి ఏనుగు తొక్కి చంపేసింది. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు ఒంటరి ఏనుగును అడువుల్లోకి తరమివేశారు. రాత్రివేళల్లో ఒంటరిగా అడువల సమీపంలోని పొలాల వద్దకు వెళ్లొందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఒంటరి ఏనుగు దాడిలో మృతి చెందిన రెడ్యానాయక్ కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల రూపాయల పరిహారాన్ని అందించింది. వారం రోజుల క్రితం కుప్పం మండలంలోని జనావాసాల్లో కనిపించిన ఈ మదపుటేనుగు రామకుప్పం మండలంలోనే నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు రైతులను చంపేసింది. నాలుగు నెలల క్రితం జూన్ 15న ఇదే గ్రామానికి చెందిన వృద్ధ రైతు కన్నా నాయక్ కూడా ఇదే ఒంటరి ఏనుగుకు బలైపోయాడు.
ఇవి కూడా చదవండి..
Weather updates: తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..
AP Politics: షర్మిలపై జగన్‌కు ఎందుకంత ‘పగ’.. అంటే..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 25 , 2024 | 10:00 AM