Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు.. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్..
ABN, Publish Date - Nov 17 , 2024 | 05:30 PM
తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. పాప వినాశనం వద్ద ఓ వర్గం వారు తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు ఊపందుకున్నాయి. పాప వినాశనంలో 20మందికి పైగా అన్యమతస్తులు పాటలతో రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తిరుపతి: తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. పాప వినాశనం వద్ద ఓ వర్గం వారు తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు ఊపందుకున్నాయి. పాప వినాశనంలో 20మందికి పైగా అన్యమతస్తులు పాటలతో రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వారు అన్యమత ప్రచారం చేయడంలో అటవీశాఖ అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం జరిగిందా, లేదా? అనే కోణంలో విచారణ చేపట్టింది. అన్యమతస్థులు తిరుమల పరిసర ప్రాంతాల్లో నిజంగా రీల్స్ చేశారా లేక మరేదైనా ప్రాంతంలో చేశారా అనే అంశాలపై టీటీడీ అధికారులు కూపీ లాగుతున్నారు. అటవీశాఖ అధికారులపై వస్తున్న ఆరోపణలను సైతం పరిగణనలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమనే విషయం అందరికీ తెలిసిందే. ఇతర మతస్తులు తమ మతానికి సంబంధించి ఎటువంటి ప్రచారాన్ని స్వామివారి పరిసర ప్రాంతాల్లో చేయకూడదు. అయినా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఘటనపై సీరియస్ అయిన టీటీడీ అధికారులు.. పాప వినాశనం వద్దకు వెళ్లి స్థానికులు, సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే రీల్స్ చేసిన మహిళలంతా పాపవినాశనం ప్రాంతంలోని హోటళ్ల వద్ద రీల్స్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. వీరంతా అక్కడ కూలి పని చేసుకునే మహిళలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా తిరుమల పరిసర ప్రాంతాల్లో టీటీడీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rammurthy Naidu: ముగిసిన రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు.. కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు..
AP Politics: క్షుద్రపూజలు చేస్తూ దొరికిపోయిన వైసీపీ నేత..
కిమ్ మామ వింత చేష్టలు.. నిద్రలేని రాత్రులతో ప్రజలు
ప్రియురాలితో జాలీ రైడ్.. ఊహించని షాక్..
Updated Date - Nov 17 , 2024 | 06:37 PM