ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:27 PM

Andhrapradesh: టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 లక్షల కేజీలు నెయ్యి సప్లైకి ఏఆర్ డైరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల...

Tirumala Laddu

తిరుమల, సెప్టెంబర్ 25: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై చర్యలకు టీటీడీ ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 లక్షల కేజీలు నెయ్యి సప్లైకి ఏఆర్ డైరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ సప్లై చేసిందని మురళీకృష్ణ తెలిపారు.

YS Sharmila: మంచి ప్రభుత్వమా, ముంచేదా.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న


ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా గతంలో ఉన్న పాత విధానాల టెస్టింగ్‌ను నిర్వహించి.. ఈ నెయ్యిని టీటీడీ వినియోగించిందని చెప్పారు. లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్‌డీబీఎల్ సహకారంతో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. జూలై 6, 12 వ తేదీల్లో ఏఆర్ డైరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం ఎన్‌డీబీఎల్ ల్యాబ్‌కు పంపామని.. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందన్నారు.


కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22, 23, 27 వ తేదిల్లో ఏఆర్ డైరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చెయ్యలేదని సెప్టెంబర్ 4న ఏఆర్ డైరీ టీటీడీకి రిప్లై ఇచ్చినట్లు మురళీకృష్ణ చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డైరీపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే


వైవీ సుబ్బారెడ్డి హోమం...

శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కలపడంపై ఆరోపణల ఎదుర్కొంటున్న . టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హోమాలకు పూనుకున్నారు. తిరుమల వివాదాల నుంచి బయటపడేందుకు బాపట్లలో వైవీ సుబ్బారెడ్డి హోమాలు, పారాయణాలు చేయించుకుంటున్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగంపై వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సమస్యలు తొలగిపోవాలని శింగరకొండ ఆంజనేయస్వామి దేవాలయంలో మన్యుసూక్త హోమం, పారాయణం చేయించుకున్నారు. అనుచరుల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయించి మరీ వైవీ సుబ్బారెడ్డి హోమం, పారాయణం చేయించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే

Donations: ఏపీ వరద బాధితులకు సుప్రీం తెలుగు న్యాయవాదుల విరాళం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 03:27 PM