ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roja: వైఎస్ షర్మిల టార్గెట్‌గా మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:54 PM

Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి, జనవరి 29: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను (APCC Chief YS Sharmila) టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువ లేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు.


ఒంగోలులో పోటీపై...

‘‘10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నగరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. విశాఖపట్నంను మించిన సభ రాయలసీమలో జరుగుతుందని వెల్లడించారు. పెద్దిరెడ్డిపై ఆదిమూలం ఆరోపణలు బాధ పెట్టాయన్నారు. ఆదిమూలంని గెలిపించింది పెద్దిరెడ్డి అని.. కక్ష సాధింపుగా ఆదిమూలం మాట్లాడారన్నారు. పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలని అన్నారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 29 , 2024 | 12:54 PM

Advertising
Advertising