ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Award: ‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు

ABN, Publish Date - Oct 01 , 2024 | 01:44 AM

చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.

మోమిడి పంచాయతీ కార్యాలయం

చిల్లకూరు, సెప్టెంబరు 30: చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ‘పేదరికం లేని జీవనోపాధి మెరుగ్గా ఉన్న పంచాయతీ, ఆరోగ్యకరమైన, చైల్డ్‌ ఫ్రెండ్లీ, తగినంత నీటి వసతి, పరిశుభ్రత- పచ్చదనం, స్వయం సమృద్ధి- మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం- సురక్షితమైన, సుపరిపాలన, ఉమన్‌ ఫ్రెండ్లీ’ వంటి 9 అంశాలపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోమిడి పంచాయతీకి పరిశుభ్రత- పచ్చదనం విభాగంలో జాతీయస్థాయి అవార్డు వచ్చింది. ఇక్కడి సర్పంచి, పంచాయతీ కార్యదర్శి మహిళలే అయినా, పరిశుభ్రత మెరుగుకు, పచ్చదనం పెంపునకు ప్రత్యేక దృష్టి సారించారు. వీటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, వారి సహకారంతో పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది.


గ్రామస్థుల సహకారంతోనే.. : ఈదూరు లావణ్య, సర్పంచి

గ్రామస్థులు, అధికారుల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నా. పరిశుభ్రత- పచ్చదనం విభాగంలో పంచాయతీకి జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉంది. పంచాయతీ మరింత అభివృద్ధిపరిచేందుకు కృషిచేస్తాం.

రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం : రమాదేవి, పంచాయతీ కార్యదర్శి

జాతీయస్థాయి ఉత్తమ అవార్డు వచ్చిన స్ఫూర్తితో.. పంచాయతీ అభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఈ అవార్డు రావడానికి సహకారం అందించిన సర్పంచుకు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.

Updated Date - Oct 01 , 2024 | 01:44 AM