Tirumala fake tickets: టీటీడీ నకిలీ టికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు..
ABN, Publish Date - Aug 19 , 2024 | 09:07 PM
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో స్వామివారి దర్శనానికి నకిలీ టికెట్లు(Fake tickets) అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. టూరిజం శాఖ ముసుగులో కొంత కాలంగా నకిలీ టికెట్ల దందా సాగుతోంది. ప్రతి నిత్యం 30నుంచి 40మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనానికి దళారీలు అనుమతిస్తున్నారు.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో స్వామివారి దర్శనానికి నకిలీ టికెట్లు(Fake tickets) అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. టూరిజం శాఖ ముసుగులో కొంత కాలంగా నకిలీ టికెట్ల దందా సాగుతోంది. ప్రతి నిత్యం 30నుంచి 40మంది భక్తులను టికెట్లు లేకుండానే దర్శనానికి దళారీలు అనుమతిస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్, టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి కొంత కాలంగా దందా సాగిస్తున్నారు.
అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కూపీ లాగి దీని వెనక ఎవరు ఉన్నారు, ఎంత కాలంగా ఈ వ్యవహారం సాగుతోందనే అంశాలపై విచారణ చేపట్టారు. నకిలీ టికెట్ల వ్యవహారంలో ఉద్యోగులే కీలకంగా ఉన్నారని తెలిసి టీటీడీ సిబ్బంది, పోలీసులు అవాక్కయ్యారు. దీని వెనక ఉన్న ఐదుగురిపై వెంటనే కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!
YS Sharmila: ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు
Updated Date - Aug 19 , 2024 | 09:10 PM