ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SP Manikanta: రూ.3.60కోట్ల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ.. ఎక్కడంటే?

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:16 PM

జిల్లాలో ఆరో దశలో భాగంగా 200సెల్‌ఫోన్లు(Cell Phones) రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు(SP Manikanta Chandolu) తెలిపారు. వీటి విలువ సుమారు రూ.45లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.

SP Manikanta Chandolu

చిత్తూరు: జిల్లాలో ఆరో దశలో భాగంగా 200సెల్‌ఫోన్లు(Cell Phones) రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు (SP Manikanta Chandolu) తెలిపారు. వీటి విలువ సుమారు రూ.45లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు ఐదు విడతల్లో భాగంగా 1,500సెల్‌ఫోన్లు రికవరీ చేశామని, ఆరో విడతలో 200రికవరీ చేసి బాధితులకు అందించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆరు దశల్లో కలిపి మొత్తం రికవరీ చేసిన ఫోన్ల విలువ రూ.3.60కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఇవన్నీ పోయిన, దొంగిలించబడిన సెల్‌ఫోన్లుగా గుర్తించామన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వీటిని రికవరీ చేసినట్లు తెలిపారు. కేసులో చురుకైన పాత్ర పోషించిన పోలీసులకు ఎస్పీ మణికంఠ చందోలు ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు.

ఇది కూడా చదవండి:

Chandrababu: చంద్రబాబు పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ ఇదే..

Updated Date - Jun 30 , 2024 | 09:23 PM

Advertising
Advertising